పురుషుల‌ను వేధించే మొటిమ‌లు.. ఈ రెండింటితో ఈజీగా నివారించ‌వ‌చ్చు!

మొటిమలు.స్త్రీ లనే కాదు పురుషులను ఇవి తీవ్రంగా వేధిస్తుంటాయి.

కాలుష్యం, దుమ్ము, ధూళి,మద్యపానం, ధూమపానం, ఆహారపు అలవాట్లు, స్కిన్ కేర్ లేక పోవడం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు ఇలా రక రకాల కారణాల వల్ల పురుషులనూ మొటిమలు బాధిస్తుంటాయి.

ఈ క్రమంలోనే వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక మరింత ఒత్తిడికి లోనవుతారు.అయితే పురుషుల‌ను ఇబ్బంది పెట్టే మొటిమ‌ల‌ను నివారించ‌డానికి ఇప్పుడు చెప్ప‌బోయే రెండు ప‌దార్థాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ రెండు ప‌దార్థాలు ఏంటీ.? వాటితో మొటిమ‌ల‌ను ఎలా త‌గ్గించుకోవాలి.

? వంటి విష‌యాల‌ను ఆల‌స్యం చేయ‌కుండా చూసేద్దాం ప‌దండి.పాలు, వెల్లుల్లి.

ఈ రెండు అంద‌రి ఇళ్ల‌ల్లో ఉండేవే.ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉండే పాలు, వెల్లుల్లిలు ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాలు చేకూరుస్తాయి.

అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. """/" / ఇక ఇప్పుడు ఈ రెండింటితోనే మొటిమ‌ల‌ను సుల‌భంగా ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర క‌ప్పు పాలు, నాలుగు పొట్టు తొల‌గించిన వెల్లుల్లి రెబ్బ‌లు వేసి గంట నుంచి రెండు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ రెండింటినీ మెత్త‌గా పేస్ట్ చేసుకుని.ఆపై అందులో అర స్పూన్ తేనెను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోట అప్లై చేసుకుని.ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజూ చేస్తే గ‌నుక మొటిమ‌లు చాలా త్వ‌ర‌గా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

ఇక చ‌ర్మంపై న‌ల్ల మ‌చ్చ‌లు ఉంటే గ‌నుక‌.వాటిని కూడా పైన చెప్పుకున్న రెమిడీతో నివారించుకోవ‌చ్చు.

మరింత భారం కానున్న రీఛార్జిలు.. నిన్న జియో, నేడు ఎయిర్టెల్.. ఇకబాదుడే..