మొటిమ‌ల వ‌ల్ల ప‌డిన మ‌చ్చ‌ల‌ను తొల‌గించే ఎఫెక్టివ్ టిప్స్ ఇవే!

యుక్త వ‌య‌సు నుంచీ మొటిమ‌లు రావ‌డం స‌ర్వ సాధార‌ణం.అయితే మొటిమ‌లు వ‌చ్చి రెండు, మూడు రోజుల్లో పోతాయి.

కానీ, వాటి తాలూకు మ‌చ్చ‌లు మాత్రం పోకుంటా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.దాంతో వాటిని వ‌దిలించుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ ర‌కాల క్రీముల‌ను కొనుగోలు చేసి వాడు తుంటారు.

అయినా ఫ‌లితం లేకుంటే మాన‌సిక కృంగుబాటుకు గ‌ర‌వుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే గ‌నుక చాలా సుల‌భంగా మొటిమ‌ల వ‌ల్ల ఏర్ప‌డిన మ‌చ్చ‌ల‌ను తొల‌గించు కోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి. """/" / ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనె, అర స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మ‌చ్చ‌లు ఉన్న చోట‌ అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

ఆపై చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల వ‌ల్ల ప‌డిన మ‌చ్చ‌లు కొద్ది రోజుల‌కే పోతాయి.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఎండిన తులసి ఆకుల పొడి, ఒక స్పూన్‌ వేప పొడి, అర స్పూన్ చంద‌నం పొడి, నాలుగు స్పూన్ల రోజ్ వాట‌ర్ మ‌రియు కొద్దిగా పెరుగు వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మచ్చ‌లు ఉన్న ప్రాంతంలో పూసి కాసేపు ఆర‌బెట్టుకోవాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజూ చేసినా మ‌చ్చ‌లు మ‌టుమాయం అవుతాయి. """/" / ఇక ఒక క్యారెట్ తీసుకుని బాగా ఉడికించి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు చిన్న గిన్నెలో ఒక స్పూన్ క్యారెట్ పేస్ట్‌, రెండు స్పూన్ల గ్రీన్ టీ మ‌రియు కొద్దిగా  నిమ్మ ర‌సం తీసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని మ‌చ్చ‌లపై పూసి ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆపై నీటితో చ‌ర్మాన్ని శుభ్ర ప‌రుచుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

స‌మ్మ‌ర్ లో బాడీ హీట్ ను మాయం చేసే టాప్ అండ్ బెస్ట్ ఫుడ్స్ ఇవే!