పిగ్మెంటేషన్‌ను ఈజీగా నివారించే ఎగ్ వైట్‌.. ఎలాగంటే?

చ‌ర్మంపై అక్క‌డ‌క్క‌డా ఏర్ప‌డే ముదురు రంగు మచ్చలనే పిగ్మెంటేషన్ అంటారు.కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, ఆహార‌పు అల‌వాట్లు, ఎగ్జిమా, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, కాలుష్యం, స్కిన్ కేర్ లేక పోవ‌డం, ఎండ‌ల ప్ర‌భావం, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చు తగ్గులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పిగ్మెంటేషన్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు.

అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ.ఎగ్ వైట్‌తో ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే పిగ్నెంటేష‌న్‌కు బై బై చెప్పేయ‌వ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఎగ్ వైట్‌తో ఏం చేయాలో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్‌, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని క‌లిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్మూత్‌గా ర‌బ్ చేసుకోవాలి.

ఆపై ప‌ది నిమిషాలు డ్రై అవ్వ‌నిచ్చి.అప్పుడు చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే పిగ్మెంటేషన్ స‌మ‌స్య క్ర‌మంగా దూరం అవుతుంది.

అలాగే బౌల్ తీసుకుని ఒక ఎగ్ వైట్‌, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఆయిల్ మ‌రియు ఒక స్పూన్ చంద‌నం పౌడ‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/"/ ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై పూసి.ప‌ది హేను నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు పిగ్నెంటేష‌న్ స‌మ‌స్య‌కు గుడ్ బై చెప్పొచ్చు.

ఇక ఈ టిప్స్‌తో పాటుగా కెమిక‌ల్ స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌కు దూరంగా ఉండాలి.

వాటర్ అధికంగా తీసుకోవాలి.డైట్‌లో తాజా పండ్లు, న‌ట్స్ ఖ‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

రోజుకు రెండు లేదా మూడు సార్లు ఫేస్ వాష్ త‌ప్ప‌కుండా చేసుకోవాలి.మ‌రియు చెడు అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.

త‌ద్వారా పిగ్మెంటేషన్‌కు త్వ‌ర‌గా స్వ‌స్థి ప‌ల‌కొచ్చు.

నేటి షెడ్యూల్ :   రాయలసీమలో షర్మిల.. గోదావరి జిల్లాలో జగన్