చేతుల‌పై పిగ్మెంటేషన్‌ను నివారించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

మొటిమ‌ల‌తో సంబంధం లేకుండా చ‌ర్మంపై నల్లని లేదా గోదుమ రంగు మచ్చలు ఏర్ప‌డ‌టాన్నే పిగ్నెంటేష‌న్ అని అంటారు.

ఆహార‌పు అల‌వాట్లు, వ‌య‌సు పైబ‌డటం, పోష‌కాల కొర‌త‌, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ధీర్ఘ‌కాలిక వ్యాధులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పిగ్మెంటేషన్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

అయితే ఈ పిగ్మెంటేషన్ అనేది ముఖంపైనే కాదు.కొంద‌రికి చేతుల‌పైనా ఉంటుంది.

దాంతో చేతులు అందవిహీనంగా క‌నిపిస్తుంటాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ రెమెడీస్‌ను పాటిస్తే గ‌నుక చేతుల‌పై పిగ్మెంటేష‌న్‌ను చాలా సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ జీల‌క‌ర్ర, ఒక క‌ప్పు ప‌చ్చి పాలు వేసి నాలుగైదు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.

"""/"/ బాగా నానిన తర్వాత మిక్సీలో వేసి జీల‌క‌ర్ర‌ను పేస్ట్‌గా చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో ఒక స్పూన్ ములెటి పౌడ‌ర్‌, ఒక స్పూన్ బాదం ఆయిల్‌ను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని చేతుల‌కు అప్లై చేసి స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.అనంత‌రం కాసేపు డ్రై అవ్వ‌నిచ్చి అప్పుడు కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే పిగ్నెంటేష‌న్ క్ర‌మంగా త‌గ్గి పోతుంది.అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల లెమెన్ పీల్ పౌడ‌ర్‌, ఒక స్పూన్ అలోవెర జెల్‌, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె తీసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చేతుల‌కు అప్లై చేసి కాస్త ఆరిన త‌ర్వాత మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేసినా చేతుల‌పై పిగ్నెంటేష‌న్ స‌మ‌స్య దూరం అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్24, ఆదివారం 2024