రాత్రుళ్లు చెమటలు అధికంగా పడుతున్నాయా..అయితే ఈ టిప్స్ మీకే!
TeluguStop.com
సాధారణంగా ఎంతటి చల్లటి వాతావరణంలో నిద్రించినా కొందరికి రాత్రుళ్లు తీవ్రంగా చెమటలు పడుతూ ఉంటాయి.
ఈ చెమటల వల్ల నిద్రను చెడిపోవడం లేదా నిద్ర నాణ్యతను దెబ్బ తినడం జరుగుతుంది.
ఫలితంగా.ఉదయానికి నీరసం, అలసట, చికాకు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి.
అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.నైట్ స్వెట్ సమస్యకు దూరంగా ఉండొచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.రాత్రుళ్లు చెమటలు అధికంగా పట్టడానికి తీసుకునే ఆహారం కూడా ఒక కారణం.
నైట్ టైమ్ తీసుకునే ఫుడ్‌లో స్పైసీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మాంసాహారాలు లేకుండా చూసుకోవాలి.
ఎందుకంటే, ఇవి శరీరంలో వేడిని పెంచే చెమటలు పట్టేలా చేస్తాయి.కెఫిన్ ఉండే ఆహారాలు, కూల్ డ్రింక్స్ కూడా ఓవర్ స్వెట్టింగ్‌కు కారణం అవుతాయి.
అలాగే శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు కూడా నైట్ టైమ్ చెమటలు అధికంగా ఉంటాయి.
అందువల్ల, వాటర్‌తో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
నైట్ స్వెట్‌తో ఇబ్బంది పడే వారు ఖచ్చితంగా రోజుకు రెండు సార్లు బాత్ చేయాలి.
"""/"/ అయితే బాత్‌కి మరీ వేడి నీటిని కాకుండా గోరు వెచ్చగా ఉండే నీరు యూజ్ చేయాలి.
మరియు యాంటి బాక్టీరియల్ సోప్స్ యూజ్ చేయాలి.తద్వారా అధిక చెమటలు నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
సాధారణంగా చాలా మందికి నైట్ పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది.
అయితే మద్యం సేవడం వల్ల కూడా రాత్రుళ్లు ఎక్కువగా చెమటలు పడుతుంటాయి.అందువల్ల, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం ఉత్తమం.
ఇక టీ ట్రీ ఆయిల్ ద్వారా అధిక చెమటలకు దూరంగా ఉండొచ్చు.అవును, ప్రతి రోజు నిద్రించే ముందు టీ ట్రీ ఆయిల్‌ను దూది సాయంతో చెమటలు ఎక్కువగా పట్టే చోట అప్లై చేయాలి.
ఇలా చేస్తే ఓవర్ స్వెట్టింగ్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
స్పిరిట్ లో స్టార్ హీరో ప్రభాస్ అలా కనిపించనున్నారా.. ఇదే జరిగితే అరాచకం!