ఆయిల్ స్కిన్‌ను దూరం చేసే సింపుల్ టిప్స్‌!

ఆయిల్ స్కిన్ (జిడ్డు చ‌ర్మం).ఈ స‌మ‌స్య చాలా మందిని వేధిస్తుంటుంది.

కేవ‌లం ఆడ‌వారినే కాదు.మ‌గ‌వారిని కూడా ఈ స‌మ‌స్య‌ తెగ ఇబ్బంది పెడుతుంటుంది.

ఆ సీజ‌న్‌.ఈ సీజ‌న్ అనే తేడా లేకుండా అన్ని సీజ‌న్స్‌లోనూ ఇలాంటి వారికి స్కిన్ జిడ్డుగానే ఉంటుంది.

ఇక ఆయిల్ స్కిన్‌ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ర‌క‌ర‌కాల క్రీములు వాడుతుంటారు.

కానీ, ఫ‌లితం లేక బాధ‌ప‌డుతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే సులువుగా ఆయిల్ స్కిన్‌ను దూరం చేసుకోవచ్చు.

అందులో ముందుగా.ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగ‌పిండి, కొద్దిగా ట‌మాటా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు బాగా ఆర‌నివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని సున్నితంగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ఆయిల్ స్కిన్ దూరం అవుతుంది.

రెండొవ‌ది.క్యారెట్ ముక్క‌లను బాగా పేస్ట్‌లా చేసుకుని ర‌సం తీసుకోవాలి.

ఆ క్యారెట్ ర‌సంలో కొద్దిగా బాదం నూనె‌ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి.

అర గంట పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా ఆయిల్ స్కిన్ త‌గ్గుతుంది.మూడొవ‌ది.

యాపిల్ ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు యాపిల్ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ‌ర‌సం మ‌రియు తేనె వేసి క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత యాపిల్ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.అర గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా చ‌ర్మంపై జిడ్డు దూరం అవుతుంది.

గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలు వైరల్!