హెడ్ బాత్ చేసినా జుట్టు జిడ్డుగా ఉంటుందా? అయితే ఈ టిప్స్ మీకే?

సాధార‌ణంగా కొంద‌రు జుట్టు జిడ్డు జిడ్డుగా ఉంటుంది.ఎలాంటి నూనెలు అప్లై చేయ‌క‌పోయినా, హెడ్ బాత్ చేసినా.

కేశాలు జిడ్డుగా ఉండ‌టాన్నే ఆయిలీ హెయిర్ అంటారు.తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ ఆయిలీ హెయిర్ స‌మ‌స్య వేధిస్తుంది.

ఈ స‌మ‌స్య‌ను నివారించు కునేందుకు చాలా మంది ఖ‌రీదైన షాంపూలు వాడు తుంటారు.

అయితే ఇంట్లో కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.ఈజీగా ఆయిలీ హెయిర్ స‌మ‌స్య‌కు బై బై చెప్పొచ్చు.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.ముల్తానీ మ‌ట్టి, ట‌మాటా కాంబినేష‌న్ ప్యాక్‌తో ఆయిలీ హెయిర్‌ను నివారించడంలో గ్రేట్‌గా స‌హాయ‌ ప‌డుతుంది.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముల్తానీ మ‌ట్టి మ‌రియు ట‌మాటా ర‌సం తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.ముప్పై, న‌ల‌బై నిమిషాల అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో త‌ల‌స్నానం చేస్తే.

జుట్టు జిడ్డుగా మార‌డం త‌గ్గుతుంది.అలాగే ఒక బౌల్ తీసుకుని.

అందులో మూడు స్పూన్ల బేకింగ్ సోడా మ‌రియు వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు పూసి.అర‌గంట అనంత‌రం హెడ్ బాత్ చేయాలి.

బేకింగ్ సోడాలో ఆయిల్ ను గ్రహించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.అందువ‌ల్ల వారంలో రెండు సార్లు బేకింగ్ సోడాను త‌ల‌కు రాస్తే.

ఆయిలీ హెయిర్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది. """/" / ఇక ఎగ్ యోల్క్ తో కూడా ఈ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

ఒక బౌల్‌లో ఎగ్ యోల్క్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.

మూడు రోజుల‌కు ఒక‌సారి ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?