బల్లి అంటే మనిషికి అంత అసహ్యం.ఇక బల్లి శాస్త్రాన్ని నమ్మే బ్యాచ్ మరొకటి.
బల్లి ఇక్కడపడితే ఇలా జరుగుతుంది, అక్కడ పడితే అలా జరుగుతుంది అనుకుంటూ నసపెడుతుంటారు.
ఈ బల్లి శాస్త్రం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనకు అనవసరం కాని, ఒక విషయం ఏమిటంటే, మనకి బల్లి ఇంట్లో తిరగటం ఇష్టం లేదు.
నిజానికి అది పురుగులని తినేస్తూ మనకు మేలు చేస్తుంది, అయినా బల్లి ఇంట్లో ఉండాలని ఎవరు కొరుకోరు.
మరి బల్లి ఇంట్లో ఉండకూడదు అంటే ఏం చేయాలి?
H3 Class=subheader-style1) ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం/h3p
బల్లి ఊరికే మీ ఇంట్లోకి రాదు .
మీ ఇంట్లో తలదాచుకునే అవకాశం దానికి ఉంటేనే మీ ఇంటిలోకి వస్తుంది.అంటే చెత్తచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని లోనికి రమ్మని ఆహ్వానిస్తుంది అన్నమాట.
కాబట్టి సెల్ఫ్ కాని, స్టోర్ కాని, క్లీన్ గా ఉందో లేదో చూసుకోవాలి.
వ్యాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, ఫర్నీచర్ ఎప్పటికప్పుడు దులుపుతూ ఉండండి, వాటిని అటుఇటు జరుపుతూ క్లీన్ చేయండి, పాత పేపర్లు, మ్యాగజీన్లలో కూడా బల్లిలు దాక్కుంటాయి గమనించండి, ఇంటి వాతావరణం శుభ్రంగా చల్లగా ఉండేలా చూసుకోండి.
ఎందుకంటే వేడి ఎక్కువ ఉన్నచోటే బల్లులు ఎక్కువుంటాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style2) సిట్రస్ వాసన పడదు/h3p
కేవలం బల్లులే కాదు, సిట్రస్ జాతి అంటే ఏ పురుగుకి పడదు.
ఇవి సిట్రస్ ఫలాల్ని కాని, ఆకులని కాని, గ్రాస్ ని కాని, అసహ్యించుకుంటాయి.
కాబట్టి లెమన్ గ్రాస్ సంపాదించండి.లెమన్ గ్రాస్ ని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి.
ఆ వాసన వాటికి పడదు.లేదంటే లెమన్ గ్రాస్ ని ఆయిల్ లో ముంచి ఎక్కడైతే బల్లులు దర్శనమిస్తున్నాయో, అక్కడ కొన్ని చుక్కలు పోయండి.
అలా కాదు అంటే లెమన్ గ్రాస్ ని అక్కడే వెలాడదీయండి.h3 Class=subheader-style3) కర్పూరం/h3p
ఇదో సింపుల్ చిట్కా.
కర్పూరం మన ఇంట్లో కామన్ గానే ఉంటుందిగా.లేకపోయినా దొరకపట్టడం ఏమంత కష్టం లేండి.
ఈ కర్పూరం వాసన మనుషులకి ఇష్టం కాని బల్లులకి ఇష్టం లేదు.అవి వాటికి ఎలర్జీని కలిగించనట్టు ఫీల్ అవుతాయట.
కర్పూరానికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయట.ఇంకేం, కర్పూరం బిల్లలు తీసుకోని బల్లులు వచ్చే చోటు దగ్గరే కాదు, ఇంట్లో అక్కడక్కడ పెట్టండి.
దెబ్బకి బల్లి పారిపోవాలి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style4) దొడ్డిదారులు మూసేయ్యండి/h3p
బల్లులు ఎక్కువగా దొడ్డిదారుల నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
అంటే గోడల్లో ఉండే పగుళ్ళు, రంధ్రాలను ఎంచుకుంటాయన్నమాట.ఇలాంటి మార్గాల నుంచే ఎవరి కంట కనబడకుండా రావడం వీటికున్న అలవాటు.
అలాంటి రహస్య ద్వారాలు మీ ఇంట్లో ఉంటే వెంటనే మూసేయ్యండి.డాక్టర్ ఫిక్స్ ఇట్ వాడతారో లేక ఇంకేదైనా వాడతారో, ఆ పగుళ్ళు, రంథ్రాలు మూసేయండి.
కిటకిల్లో మెటల్ స్క్రీన్స్ వాడండి.వంటగదిలో కాని, బాత్ రూమ్ లో కాని పగుళ్ళు ఉన్న పైపులు ఏమైనా ఉన్నాయో లేదు గమనించి మూసేయండి.
H3 Class=subheader-style5) చల్లదనం భరించలేవు :/h3p
ఇంతకుముందు చెప్పినట్లుగా బల్లి వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండేందుకు ఇష్టపడుతుంది.
అది వాతావరణంలో సడెన్ గా మార్పు జరిగితే తట్టుకోలేదు.కాబట్టి మీ ఇంట్లో వాతావరణం లేదా టెంపరేచర్ మారేలా చేయండి.
ఏసి అన్ చేయండి, ఆ చలి భరించడం వాటి వల్ల కాదు.లేదంటే ఓ స్ప్రే బాటిల్ తీసుకోని, అందులో ఐస్ క్యూబ్స్ వేసి, అవి ఇలా కరుగుతుండగానే నీటిని బల్లులపై స్ప్రే చేయండి.
దెబ్బకి పరుగు పెడతాయి.అందులో ఎటువంటి అనుమానం లేదు.
H3 Class=subheader-style6) దాని ఆహారం ఇంట్లో ఉంచొద్దు/h3p
బల్లికి మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంటుంది ? దానికి ఎలాగో ఓ ఇల్లు అక్కరలేదు కదా.
మరి ఇంటికి ఎందుకు వస్తున్నట్లు? ఆహారం కోసమే కదా.మీ ఇంట్లో తనకి ఆహారం ఉందని అనిపిస్తేనే అది లోనికి వచ్చేది.
మరి దాని అహారాన్నే ఇంట్లో లేకుండా చేస్తే ? మీరు తిన్న తిండి ఇంట్లో ఎక్కడ పడి ఉండకుండా శుభ్రం చేయండి, నీళ్ళు ఓ చోట ఆగి ఉంటే కూడా బల్లులు ఆకర్షితులవుతాయి.
ఇలా ఎందుకో తెలుసా ? ఈ వాతవరణంలో పురుగులు వస్తాయని దానికి తెలుసు .
ఇక పురుగు కనిపిస్తే అది నాలుకతో ఎలా దాడిచేస్తుందో కూడా మనకు తెలుసు.
H3 Class=subheader-style7) నెమలీక అంటే భయం :/h3p
వినడానికి విచిత్రంగానే ఉండొచ్చు కాని నెమలీక అంటే బల్లులకి భయమని అంటారు కొందరు.
ఎందుకో, మన కంటికి అందంగా కనిపించే నెమలీక వాటిని మాత్రం భయపెడుతుందట.నిజమో అబద్ధమో, ప్రయత్నిస్తే తప్పేముంది .
ఓసారి నెమలీకలు వేలాడదీసి చూడండి.బల్లులు వస్తాయో, రావో, వచ్చినా నెమలీకను చూసి అక్కడే ధైర్యంగా ఉంటాయో ఉండవో.
బల్లులు వచ్చేచోట తాడుతో పైగి కట్టి నెమలీకలు వేలాడదీసి, అవి గాలికి కదిలేలా కట్టండి చాలు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style8) ఇతర చిట్కాలు :/h3p
* పెప్పర్ స్ప్రే మంటను కూడా తట్టుకోలేవు బల్లులు.
వాటితో ఎటాక్ చేయవచ్చు.* పైన చెప్పినట్లుగా సిట్రస్ జాతితో బల్లికి పడదు.
నిమ్మకాయలు కోసి వాసన వచ్చేలా బయటపెట్టండి.* కాఫీ, తంబాకు వాసన కూడా వాటికి పడదు.