చ‌లికాలంలో వేధించే బద్ధకాన్ని ఎలా త‌గ్గించుకోవాలో తెలుసా?

ప్ర‌స్తుతం చ‌లి కాలం కొన‌సాగుతోంది.ఈ కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రినీ వేధించేది బ‌ద్ధ‌క‌మే.

చ‌లి కార‌ణంగా బ‌ద్ధ‌కం విప‌రీతంగా పెరిగి పోతుంటుంది.దాంతో ఏ ప‌ని చేయ‌లేక‌పోతుంటారు.

డైట్‌లు, వ్యాయామాల‌ను కూడా ప‌క్క‌న పెట్టేస్తుంటారు.దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టేస్తుంటాయి.

అందుకే బ‌ద్ధ‌కాన్ని వ‌దిలించుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బ‌ద్ధ‌కాన్ని ఎలా త‌గ్గించుకోవాలో ఓ చూపు చూసేయండి.

చ‌లి కాలంలో వేధించే బ‌ద్ధ‌కాన్ని నివారించ‌డంలో మిరియాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ఈ సీజ‌న్‌లో న‌ల్ల మిరియాల‌ను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే శ‌రీరంలో వేడి పెరిగి బ‌ద్ధ‌కం దూరం అవుతుంది.

అదే స‌మ‌యంలో చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి సైతం ల‌భిస్తుంది.అలాగే శ‌రీరానికి స‌రిప‌డా నిద్ర లేక‌పోయినా బ‌ద్ధ‌కంగా ఉంటుంది.

కాబ‌ట్టి, రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంట‌లు ఖచ్చితంగా ప‌డుకోవాలి.అప్పుడే బ‌ద్ధ‌కానికి దూరంగా ఉండ‌గ‌లుగుతారు.

"""/" / తుల‌సి ఆకులు బ‌ద్ధ‌కాన్ని త‌రిమి కొట్ట‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

బ‌ద్ధ‌కంగా ఉన్న స‌మ‌యంలో తులసి ఆకుల‌తో త‌యారు చేసిన క‌షాయంగానీ, టీగానీ తీసుకుంటే శ‌రీరం మ‌రియు మెద‌డు రెండూ ఫుల్ యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా మారిపోతాయి.

"""/" / బ‌రువు అదుపు త‌ప్పే కొద్ది బ‌ద్ధ‌కం కూడా పెరిగి పోతుంది.

అందుకే సీజ‌న్ ఏదైనా వ్యాయామాల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.అయితే చ‌లి కాలంలో ఉద‌యాన్నే వ్యాయామాల‌ను చేయలేని వారు.

ఏదో ఒక స‌మ‌యంలో వ‌ర్కౌట్లు చేస్తే బాడీ వెయిట్ కంట్రోల్‌లో ఉంటుంది.ఇక డ్రై ఫ్రూట్స్, నట్స్, అల్లం, నువ్వులు, బెల్లం, సిట్ర‌స్ ఫ్రూట్స్‌, నెయ్యి వంటి ఆహారాల‌ను చ‌లి కాలంలో త‌ప్ప కుండా తీసుకోవాలి.

ఎందు కంటే, ఇవి ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డ‌మే కాదు బ‌ద్ధ‌కాన్ని కూడా త‌గ్గిస్తాయి. .

బీజేపీ ఎవరికీ బీ -టీమ్ కాదు..: కిషన్ రెడ్డి