మోకాళ్ళ నొప్పులతో మెట్లు ఎక్కలేకపోతున్నారు.. చింత గింజలతో చెక్ పెట్టండిలా!

వ‌య‌సు పైబ‌డిన వారు మోకాళ్ళ నొప్పుల‌తో ఇబ్బంది ప‌డ‌టం అనేది స‌ర్వ‌సాధార‌ణం.కానీ ఇటీవల రోజుల్లో వృద్ధులే కాకుండా యువ‌త‌లో సైతం ఎంతో మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.

మోకాళ్ళ నొప్పులు కారణంగా మెట్లు ఎక్కాలన్నా, ఎక్కువ సేపు నిలబడాలన్నా, కాసేపు నడవాలన్నా ఎంతో బాధాకరంగా ఉంటుంది.

ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు.

కానీ సహజంగా కూడా మోకాళ్ళ నొప్పులను వదిలించుకోవచ్చు.అందుకు చింత గింజలు( Tamarind Seeds ) ఎంతగానో సహాయ పడతాయి.

ప్రస్తుత వేసవికాలంలో ఎవరింట్లో చూసినా చింతపండు, చింత గింజలే కనిపిస్తుంటాయి.చాలా మంది చింత గింజలు పనికి రావాని అమ్మేస్తుంటారు.

కానీ చింత గింజల్లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందువల్ల ఆరోగ్యానికి చింత గింజలు ఎంతో మేలు చేస్తాయి.

చింతగింజలతో పలు అనారోగ్య సమస్యలను( Health Problems ) కూడా నివారించుకోవచ్చు.ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పని చేస్తాయి.

"""/" / మోకాళ్ళ నొప్పులతో సత‌మ‌తం అవుతున్న వారు ఒక గ్లాస్ వాట‌ర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ చింత గింజ‌ల పొడి వేసి( Tamarind Seeds Powder ) మ‌రిగించాలి.

ఇలా మరిగించిన వాట‌ర్ ను స్ట్రైన‌ర్ స‌హాయంతో ఫిల్ట‌ర్ చేసుకుని సేవించాలి.ప్ర‌తి నిత్యం ఈ విధంగా చేశారంటే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.

ఎముకల బలహీనత దూరం అవుతుంది.మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

పైగా చింత గింజల పొడి వేసి మ‌రిగించిన నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సైతం నియంత్రణలో ఉంటాయి.

"""/" / ఇక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి చింత గింజ‌లే కాకుండా పసుపు పాలు, మెంతులు నీరు, వాము నీరు, అల్లం టీ, తులసి టీ వంటివి కూడా ఎంతో మేలు చేస్తాయి.

మోకాళ్ళ నొప్పులకు ఈ పానీయాలు సమర్థవంతంగా చెక్ పెడతాయి.