నిద్రలేమితో భయమెందుకు.. బార్లీ ఉందిగా అండగా!

ఇటీవల కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో( Insomnia ) సతమతం అవుతున్నారు.

నిద్ర సమయాన్ని వృధా చేయడం, వయసు పై పడటం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర అంశాలు నిద్రలేమికి దారి తీస్తాయి.

ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు నెత్తి మీద వచ్చి కూర్చుంటాయి.

ఆ భయంతోనే నిద్రలేమిని వదిలించుకోవడం కోసం నానా తిప్పలు పడుతుంటారు.కొందరు మందులు కూడా వాడుతుంటారు.

కానీ సహజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.అందుకు బార్లీ గింజలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

చూడటానికి చిన్నగా ఉన్నా బార్లీ గింజల్లో ( Barley Seeds )అనేక పోషకాలు నిండి ఉంటాయి.

ఆరోగ్యపరంగా బార్లీ బోలెడు ప్రయోజనాలను చేకూరుస్తాయి.నిద్రలేమి సమస్యను దూరం చేయడానికి కూడా బార్లీ సహాయపడుతుంది.

ముఖ్యంగా బార్లీ గింజలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే సులభంగా నిద్రలేమికి బై బై చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బార్లీ గింజలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి.

"""/" / ఆ తర్వాత అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్లు సొంపు గింజలు,( Fennel Seeds )నాలుగు యాలకులు వేసి వేయించాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టిన బార్లీ గింజలు, యాలకులు,( Cardamom ) సోంపు వేసి పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న బార్లీ పౌడర్ ను వేసి మరిగించాలి.

"""/" / దాదాపు 5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

ఈ బార్లీ వాటర్ ను నైట్ నిద్రించడానికి గంట ముందు తీసుకోవాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే నిద్రను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది.

ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.

అలాగే ఈ బార్లీ వాటర్ లో తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మలబద్ధకం సమస్య సైతం దూరం అవుతుంది.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు ఒకే కానీ మిగతా యంగ్ హీరోలు సక్సెస్ కొట్టకపోతే కష్టమేనా..?