ప్రెగ్నెన్సీ టైమ్‌లో వేధించే త‌ల‌నొప్పి..ఇలా చేస్తే ప‌రార్‌!

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స్త్రీలు ఎదుర్కొనే కామ‌న్ స‌మ‌స్య‌ల్లో త‌ల నొప్పి ఒక‌టి.ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, స‌రిగ్గా వాట‌ర్ తీసుకోక‌పోవ‌డం, ఒత్తిడి, నిద్ర లేక‌పోవ‌డం, లో బీపీ, శ‌రీరంలో అధిక వేడి, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, హార్మోన్లలో మార్పులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల త‌ర‌చూ త‌ల నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

ఈ త‌ల నొప్పిని ఎలా నివారించుకోవాలో తెలియ‌క గ‌ర్భిణీలు తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.

ఈజీగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో వేధించే త‌ల నొప్పికి టాటా చెప్పొచ్చు.మ‌రి లేట్ చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఇబ్బంది పెట్టే త‌ల నొప్పికి పాల‌తో నివారించుకోవ‌చ్చు.గోరు వెచ్చ‌టి పాల‌లో చిటికెడు రాతి ఉప్పు క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేస్తే.కొద్ది సేప‌టికే త‌ల నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అయితే ఫ్యాట్ లేని పాల‌ను వాడితే మంచిది.అలాగే త‌ల నొప్పి త‌ర‌చూ వ‌స్తుంటే.

పండ్ల ర‌సాలు ఎక్కువ‌గా తీసుకోవాలి.ముఖ్యంగా బ‌త్తాయి, దానిమ్మ‌, పుచ్చ, కివి వంటి పండ్ల ర‌సాల‌ను తీసుకుంటే త‌ల నొప్పి ద‌రి చేర‌కుండా ఉంటుంది.

"""/"/ అవిసె గింజలు కూడా త‌ల నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌వు.గ‌ర్భిణీలు అవిసె గింజ‌ల‌ను పొడి చేసి స‌లాడ్స్ రూపంలో తీసుకోవ‌డ‌మో, రొట్టెల్లో వేసి తీసుకోవ‌డ‌మో చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

త‌ల నొప్పి తీవ్రంగా ఉన్న‌ప్పుడు ఒక క‌ప్పు పెరుగులో ఒక స్పూన్ నిమ్మ ర‌సం, అర స్పూన్ బ్రౌన్ షుగ‌ర్ మ‌రియు చిటికెడు ఉప్పు వేసి బాగా క‌లిపి తినాలి.

"""/"/ ఇలా చేస్తే త‌క్కువ స‌మ‌యంలో త‌లనొప్పి పరార్ అవుతుంది.మ‌రియు ఒత్తిడి, ఆందోళ‌న, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

ఇక వీటితో పాటుగా గ‌ర్భిణీలు వాట‌ర్‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.డైట్‌లో కూరగాయలు, ఆకుకూర‌లు, పండ్లు, న‌ట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి.

ప్ర‌తి రోజు ఇర‌వై నిమిషాలు అయినా వాకింగ్ చేయాలి.బీపీని అదుపులో ఉంచుకోవాలి.

ఒత్తిడికి దూరంగా ఉండాలి.బాగా నిద్ర పోవాలి.

త‌ద్వారా త‌ల నొప్పి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

పవన్ ప్రాధాన్యం పెరుగుతోందిగా.. జమిలి ఎన్నికలొస్తే డబుల్ బెనిఫిట్