ఇంటి పనులతో రోజూ అలసిపోతున్నారా? అయితే ఇవి మీ డైట్‌లో ఉండాల్సిందే!
TeluguStop.com
ఇంటి పనులు చేయడం దాదాపు ఆడవారి డ్యూటేనే.ఉద్యోగం చేసే వారైనా ఇంటి పనులను చక్కబెట్టుకున్న తర్వాతే ఆఫీస్ వెళ్తారు.
అయితే ఇంట్లో ఒకరిద్దరు ఉంటే పెద్దగా పని ఉండకపోవచ్చు గానీ.ఐదారుగురు ఉంటే మాత్రం వారికి వండి పెట్టడం, తిండి పెట్టడం, వారి బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎన్నో పనులు ఉంటాయి.
అవన్నీ పూర్తి చేసేటప్పటికీ శరీరంలో శక్తినంతా కోల్పోతారు.ఈ క్రమంలోనే కొందరు తీవ్ర అలసటకు, మైకంకు గురవుతారు.
ఇలా ఎప్పుడైనా ఒకరోజు జరిగితే ఎలాంటి సమస్య ఉండదు.కానీ, ప్రతి రోజు ఇలానే అవుతుంటే మాత్రం ఖచ్చితంగా డైట్‌లో కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.
మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.చిలగడదుంపలు ఎంతో రుచిగా ఉంటాయి.
అనేక పోషకాలనూ కలిగి ఉంటాయి.వీటిని ఊడికించి రెగ్యులర్‌గా తగిన మోతాదులో తీసుకుంటే తరచూ అలసట చెందకుండా ఉంటాయి.
ఒకవేళ అలసటగా ఉన్న సమయంలో వీటిని తీసుకుంటే వెంటనే రిలీఫ్ అవుతారు. """/"/
బెల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించడమే కాదు శరీరానికి బోలెడంత శక్తినీ ఇవ్వగలదు.
రోజులో ఏదో ఒక సమయంలో చిన్న బెల్లం ముక్కను తీసుకోవాలి.ఇలా చేస్తే అలసట, నీరసం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
ఇంటి పనులతో రోజూ అలసటకు గురయ్యే వారు.ప్రతి రోజు పసుపు పాలను సేవించాలి.
పసుపు పాలలో ఉండే పోషకాలు అధిక ఒత్తిడిని తగ్గిస్తాయి.శరీన్ని యాక్టివ్‌గా మారుస్తాయి.
అలసటను దూరం చేస్తాయి. """/"/
అలాగే టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని సేవించాలి.
తద్వారా ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు శరీరాన్ని అలసటకు గురికాకుండా అడ్డుకట్ట వేస్తాయి.
మరియు ఇంటి పనుల వల్ల వచ్చే ఒళ్లు నొప్పులను సైతం నివారిస్తాయి.అరటి పండు అలసటను ఇట్టే పోగొట్టగలదు.
కాబట్టి, రెగ్యులర్‌గా డైట్‌లో ఒక అరటి పండు ఉండేలా చూసుకోండి.లేదు మాకు అరటి పండు ఇష్టం ఉండదు అనుకుంటే బొప్పాయి, యాపిల్, దానిమ్మ, కివి, సపోటా, స్ట్రాబెర్రీ వంటి పండ్లను కూడా తీసుకోవచ్చు.
ఇక వీటితో పాటుగా పెరుగు, ఆకుకూరలు, ఓట్స్, గుమ్మడికాయ విత్తనాలు, గుడ్డు వంటి ఆహారాలను సైతం డైట్‌లో ఉండేలా చూసుకోండి.
రాగులను ఇలా కనుక తీసుకుంటే రక్తహీనత ఎగిరిపోతుంది!