యంగ్ ఏజ్ లోనే ముడతలు వచ్చేసాయా? వర్రీ వద్దు.. ఇలా చేయండి!

వయసు పైబ‌డిన తర్వాత కండరాలు పటుత్వాన్ని కోల్పోయి చర్మం ముడతలు( Wrinkles ) పడటం సర్వ సాధారణం.

కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది యంగ్ ఏజ్ లోనే ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఇందుకు కారణాలు అనేకం.ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, ధూమపానం ,మద్యపానం తదితర కారణాల వల్ల ముఖంపై చిన్న వయసులోనే ముడతలు ఏర్పడుతుంటాయి.

మీకు ఇలాగే జరిగిందా.? అయితే అస్సలు చింతించకండి.

"""/" / ఎందుకంటే.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే యంగ్ ఏజ్( Young Age ) లో వేధిస్తున్న ముడతలు దెబ్బకు పరార్ అవుతాయి.

మీ చర్మం యవ్వనంగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green Tea Powder ) వేసి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి( Wheat Flour ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా ఒక ఎగ్ వైట్ ను కూడా వేసి మరోసారి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రెష్‌ సహాయంతో చ‌ర్మానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని.అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

"""/" / రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

ముడతలు కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.ముఖ చర్మం యవ్వనంగా కాంతివంతంగా మారుతుంది.

కాబట్టి యంగ్ ఏజ్ లోనే మడతలు వచ్చేసాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

పొట్ట కొవ్వు ఐసు ముక్కలా కరగాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!