డ‌బుల్ చిన్‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

డ‌బుల్ చిన్‌.చాలా మందిని బాధిస్తున్న స‌మ‌స్య ఇది.

మెడ కింద కొవ్వు పేరుకుపోవడం కారణంగా దవడ కింద మరో దవడ ఉన్నట్లు కనిపిస్తుంది.

దీనేనే డ‌బుల్ చిన్ అంటారు.అమ్మాయిల్లో ఈ స‌మ‌స్య‌ చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

వయసు పైబడడం, ఆహార‌పు అల‌వాట్లు, అధిక బ‌రువు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల డ‌బుల్ చిన్ ఏర్ప‌డుతుంది.

కొంద‌రికి వంశపారంపర్యంగా కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది.అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ & ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే చాలా సులుభంగా డ‌బుల్ చిన్‌కు బై బై చెప్పొచ్చు.

మ‌రి ఎందుకు లేటు ఏ టిప్స్ ఏంటో చూసేయండి.గ్రీన్ టీ శ‌రీరంలో అన‌వ‌స‌ర‌పు కొవ్వుల‌ను క‌రిగించ‌డంలో అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.

అందు వ‌ల్ల‌, డ‌బుల్ చిన్ ఉన్న వారు రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకుంటే మెడ కిండి పేరుకుపోయిన కొవ్వు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

డ‌బుల్ చిన్ త‌గ్గించుకోవాల‌నుకునే వారు వాట‌ర్‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.అవును, రోజుకు ప‌న్నెండు గ్లాసుల వాట‌ర్ తాగితే శ‌రీరంలో వేస్ట్ ఫ్యాట్ ఫాస్ట్‌గా త‌గ్గుతుంది.

ఎగ్ వైట్ సాగిన చ‌ర్మాన్ని టైట్‌గా మార్చ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.అందు వ‌ల్ల‌, బౌల్‌లో తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్‌, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని మెడపైన ప్యాక్ లా రాసుకుని ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా రోజూ చేస్తే మీ మెడ కింద చర్మం బిగుతుగా మారుతుంది. """/"/ అలాగే ఏ ఆహారాన్ని తీసుకున్నా బాగా న‌మిలి న‌మిలి తినాలి.

త‌ద్వారా డ‌బుల్ చిన్ త‌గ్గ‌డంతో పాటు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం మెరుగు ప‌డుతుంది.

ఇక డ‌బుల్ చిన్ ఉన్న వారు ఉప్పును ఎంత త‌క్కువ తీసుకుంటే అంత మంచిది.

మ‌రియు జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్‌ను తిన‌డం మానేయాలి.వీటితో పాటుగా ప్ర‌తి రోజూ మెడ‌కు సంబంధించిన వ్యాయామాల‌ను ఐదు నుంచి ప‌ది నిమిషాల చేయాలి.

దాంతో డ‌బుల్ చిన్ స‌మ‌స్య త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

ప్రభాస్ ఎవడో నీకు తెలియదా… షర్మిలను టార్గెట్ చేసిన రెబల్ ఫ్యాన్స్!