ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే డార్క్ స‌ర్కిల్స్ స‌మ‌స్యే ఉండ‌ద‌ట‌..తెలుసా?

డార్క్ స‌ర్కిల్స్‌.చాలా మందిని తీవ్రంగా వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి.

క‌ళ్ల చుట్టూ డార్క్ స‌ర్కిల్స్ (వ‌ల‌యాలు) ఏర్ప‌డ‌టం వ‌ల్ల వ‌య‌సు పైబ‌డిన వారిలా క‌నిస్తారు.

అలాగే ముఖం అందవిహీనంగా క‌నిపిస్తుంది.అందుకే డార్క్ స‌ర్కిల్స్‌ను వ‌దిలించుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ ఇప్పుడు చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటే డార్క్ స‌ర్కిల్స్ అన్న స‌మ‌స్యే ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ఒత్తిడి, ఆందోళ‌న.

ఈ రెండూ ఎంత అదుపులో ఉంటే డార్క్ స‌ర్కిల్స్‌కు అంత దూరంగా ఉండొచ్చు.

అందుకే ప్ర‌తి రోజు క‌నీసం ప‌ది నిమిషాలు అయినా మెడిటేషన్ చేయండి.త‌ద్వారా ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గు మ‌న‌సు ప్ర‌శాంత‌గా మారుతుంది.

అలాగే ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్లను వాడ‌టం త‌గ్గించుకోవాలి.లేట్ నైట్ స్లీప్ అల‌వాటు ఉంటే మానుకోవాలి.

మ‌రియు మధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌ర్వాత నిద్ర వ‌స్తుంటుంది.కానీ, ఆ స‌మ‌యంలో చాలా మంది చేసే పొర‌పాటు నిద్ర‌ను ఆపుకుంటారు.

నిజానికి భోజ‌నం త‌ర్వాత నిద్ర వ‌స్తే ఖ‌చ్చితంగా ఓ చిన్న కునుకు వేసేయండి.

దాంతో కంటి అల‌స‌ట త‌గ్గి డార్క్ స‌ర్కిల్స్ ప‌డ‌కుండా ఉంటాయి. """/"/ డార్క్ స‌ర్కిల్స్ తీవ్రంగా ఉండే.

పాల‌ల్లో కుంకుమ పువ్వును నాన బెట్టుకుని.క‌ళ్ల చుట్టూ అప్లై చేసుకోవాలి.

ఇలా రోజూ చేస్తే.కొద్ది రోజుల‌కే న‌ల్ల‌టి వ‌ల‌యాలు పోయి క‌ళ్లు అందంగా మార‌తాయి.

ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కోసం కొంద‌రు సబ్బులను ఓవ‌ర్‌గా యూజ్ చేస్తుంటారు.అలా చేయ‌డం వ‌ల్ల సైతం డార్క్ స‌ర్కిల్స్ ఏర్ప‌డ‌తాయి.

అందుకే వాటిని ఎంత త‌క్కువ‌గా వాడితే అంత మంచిది.తాటి బెల్లం, కొబ్బరి, వేరుశెనగలు.

ఈ మూడింటితో తయారుచేసిన స్నాక్స్‌ను తీసుకోవాలి.త‌ద్వారా కంటి అల‌స‌ట త‌గ్గి.

న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

కేవలం ఈ రెండిటితో వైట్ అండ్ యూత్ ఫుల్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?