చుండ్రును తరిమికొట్టే పసుపు.. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?

చుండ్రు సమస్య( Dandruff )తో బాధపడుతున్నారా.? ఎంత ఖరీదైన షాంపూను వాడిన సరే అది మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా.

? వర్రీ వద్దు.ఖ‌రీదైన షాంపూతో కాదు మన వంట గదిలో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా మరియు చాలా వేగంగా చుండ్రును వదిలించుకోవచ్చు.

ముఖ్యంగా పసుపు చుండ్రు( Turmeric )ను తరిమి కొట్టడానికి అద్భుతంగా సహాయపడుతుంది.సాధారణంగా మనం పసుపును నిత్యం వంటల్లో వాడుతుంటాము.

అలాగే సౌందర్య సాధనలో కూడా ఉపయోగిస్తాము. """/" / ఆరోగ్యానికి, చర్మానికి పసుపు అందించే ప్రయోజనాలు అనేకం.

అయితే చుండ్రు సమస్యను దూరం చేయడానికి కూడా పసుపు ఉప‌యోగ‌ప‌డుతుంది.పసుపులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

ఇవి తలపై ఇన్ఫెక్షన్ ను నివారిస్తాయి.చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.

మరి ఇంతకీ తలకు పసుపును ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.

అలాగే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( Castor Oil ) వేసి అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసుకుని చేతివేళ్లతో కనీసం 10 నిమిషాలైనా మసాజ్ చేసుకోవాలి.

"""/" / గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ హోమ్ రెమెడీని పాటించండి.పసుపుతో పాటు ఆముదం మరియు నిమ్మరసం కూడా చుండ్రు సమస్యను సమర్థవంతంగా అరికడతాయి.

ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తాయి.స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తాయి.

కాబట్టి చుండ్రు సమస్యతో సతమతం అవుతున్నవారు తప్పకుండా పసుపుతో ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని ప్రయత్నించండి కేవలం మూడు నాలుగు వాషుల్లోనే చుండ్రుకు బై బై చెప్పండి.

6,6,6,6,6.. స్టార్ స్పిన్నర్ కి చుక్కలు చూపించిన పొలార్డ్..