చుండ్రును త‌రిమికొట్టే ఆరెంజ్ పీల్.. ఎలా వాడాలంటే..?

మనలో చాలా మంది అత్యంత కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో చుండ్రు( Dandruff ) ఒకటి.

తలలో చుండ్రు ఉండటం వల్ల తీవ్ర సౌకర్యానికి గురవుతుంటారు.చుండ్రు కారణంగా దురద, అధిక హెయిర్ ఫాల్, డ్రై హెయిర్( Hair Fall, Dry Hair ) వంటి ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే చుండ్రును వదిలించుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే మీకు ఆరెంజ్ పీల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.సాధారణంగా ఆరెంజ్ పండ్లను తినేటప్పుడు తొక్క తీసి బయట పారేస్తుంటారు.

కానీ ఆరెంజ్ పండు మాత్ర‌మే కాదు ఆరెంజ్‌ తొక్కలు( Orange Peels ) కూడా మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఆరెంజ్ తొక్కలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

ఇవి మ‌న చ‌ర్మంతో పాటు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా తోడ్ప‌డ‌తాయి.ముఖ్యంగా చుండ్రును త‌రిమికొట్ట‌డానికి ఆరెంజ్ పీల్ స‌హాయ‌ప‌డుతుంది.

మరి ఇంతకీ త‌ల‌కు ఆరెంజ్ పీల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ప‌దండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఆరెంజ్ తొక్కలు వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఆరెంజ్ తొక్కల‌ను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) మరియు రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ( Lemon Juice ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే పరార్ అవుతుంది.

కేవలం రెండు మూడు వాషుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గ‌మ‌నిస్తారు.చుండ్రును దూరం చేసుకోవ‌డానికి ఈ ఆరెంజ్ పీల్ హెయిర్ మాస్క్ ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి త‌ప్ప‌క ట్రై చేయండి.

సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంది.. ఒలింపిక్స్ మెడల్ సాధించింది.. మను భాకర్ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!