ఉల్లి తొక్కలను పారేస్తున్నారా.. ఇలా వాడితే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా మాయం అవుతుంది!

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యం ఉల్లిపాయలను( Onions ) వాడుతుంటారు.అయితే ఉల్లిపాయలకు ఉండే తొక్కలు ఎందుకు పనికి రావని చెప్పి డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.

కానీ వాటి వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా చుండ్రు సమస్యను వదిలించడానికి ఉల్లితొక్కలు అద్భుతంగా సహాయపడతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లి తొక్కలను ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకుందాం ప‌దండి.

"""/"/ ముందుగా రెండు కప్పులు ఉల్లి తొక్కలను( Onion Peels ) తడి లేకుండా బాగా ఎండ పెట్టుకోవాలి.

ఇలా ఎండబెట్టిన తొక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉల్లి తొక్క పొడి వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పొడి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే కనుక చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బకు మాయం అవుతుంది.

"""/"/ స్కాల్ప్ హెల్తీ గా మారుతుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.

కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.చాలా మంది తమ హెయిర్ డ్రై గా మారుతుందని బాధపడుతుంటారు.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కూడా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే జుట్టు స్మూత్ గా సిల్కీగా కూడా మెరుస్తుంది.కాబట్టి ఉల్లి తొక్కల‌ను పారేయకుండా ఇలా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించండి.

తండేల్ సినిమాలో నాగ చైతన్య కి సపోర్ట్ గా నాగార్జున కూడా నటిస్తున్నాడా..?