జుట్టు ఆరోగ్యానికి అండగా తులసి.. ఇలా వాడితే చుండ్రు ప‌రార్‌!

తులసి మొక్కను మన భారతీయులు ఎంతో పవిత్రంగా చూస్తారు.ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో తులసి మొక్కను నాటి పూజలు చేస్తారు.

తులసి ఆకుల్లో ఎన్నో పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగా తులసి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుందని అందరికీ తెలుసు.

అయితే జుట్టు ఆరోగ్యానికి కూడా తులసి అండ‌గా నిలుస్తుంది.తులసి ఆకులను( Basil Leaves ) ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే చుండ్రు సమస్య( Dandruff Problem ) పరార్ అవ్వడమే కాకుండా మరెన్నో లాభాలు చేకూరుతాయి.

మరింతకీ జుట్టుకు తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ఒక కలబంద ఆకును తీసుకుని శుభ్రంగా వాట‌ర్ తో కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది నుంచి ప‌దిహేను ఫ్రెష్ తులసి ఆకులు వేసుకోవాలి.

అలాగే అలోవెరా జెల్ ( Aloe Vera Gel )మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ( Curd )వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ( Olive Oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బకు పరార్ అవుతుంది.

అలాగే స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుందికురులు ఆరోగ్యంగా మారతాయి.స్ట్రాంగ్ గా తయారవుతాయి.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభం అవుతుంది.అలాగే ఈ తులసి హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల తలలో దురద, ఇన్ఫెక్షన్ వంటివి ఏమైనా ఉంటే నయం అవుతాయి.

మరియు జుట్టు షైనీగా సైతం మెరుస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…