చుండ్రు స‌మ‌స్య వేధిస్తుందా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే!

చుండ్రు.ఆడ‌‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్యతో ఇబ్బంది ప‌డుతుంటారు.

ఎన్ని షాంపూలు మార్చిన త‌ల‌లో చుండ్రు మాత్రం త‌గ్గ‌దు.త‌లలో అధికంగా ఉండే నూనె, మృతచర్మ కణాల వ‌ల్ల చుండ్రు ఏర్ప‌డుతుంది.

ఈ చుండ్ర‌ను త‌గ్గించుకొనేందుకు చాలా మంది యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడ‌తారు.వీటి వ‌ల్ల తాత్కాలికంగా చుండ్రు త‌గ్గినా.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌చ్చేస్తుంటుంది.అయితే స‌హాజ సిద్ధంగా కూడా చుండ్రు స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌రి అందుకు ఏం చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.చుండ్రు స‌మ‌స్య ఉన్న‌వారు.

ఒక బౌల్‌లో కొద్దిగా ప‌సుపు మ‌రియు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.అర‌గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది.

"""/" / రెండొవ‌ది.ముందుగా పుదీనా ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి.

ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా నిమ్మ‌ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు బాగా అప్లై చేసి.ఇర‌వై నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా వ‌దిలేస్తుంది.

ఇక మూడొవ‌ది.క‌రివేపాకు మ‌రియు వేపాకు రెండు మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు వేసి బాగామిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.

ఒక గంట స‌మ‌యం పాటు అలా వ‌దిలేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా త‌ల‌లోని చ‌ర్మంపై ఉండే ఫంగ‌స్‌ని దూరం చేసి.

చుండ్రును క్ర‌మంగా త‌గ్గిస్తుంది.మ‌రియు ఈ హెయిర్ ప్యాక్ వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా కూడా పెరుగుతుంది.

Ram Charan : రామ్ చరణ్ ఎంత మంచి వాడంటే ఆయన ఫ్రెండ్ కోసం అంత పని చేశాడా..?