మందులెన్ని వాడినా జలుబు తగ్గట్లేదా? అయితే మీకే ఈ జ్యూసులు!
TeluguStop.com
చలి కాలం రానే వచ్చింది.ఈ సీజన్‌లో ప్రధానంగా వేధించే సమస్యల్లో జలుబు ఒకటి.
అయితే కొందరికి జలుబు వచ్చినా వెంటనే తగ్గుతుంది.కానీ, కొందరు ఎన్ని మందులు వాడినా పట్టుకున్న జలుబు వదలనే వదలదు.
అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే జ్యూసులు తీసుకుంటే గనుక జలుబు ఇట్టే పోతుంది.
మరి ఆ జ్యూసులు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఒక గిన్నెలో గ్లాస్ వాటర్, అర కప్పు బీట్ రూట్ తురుము, అర స్పూన్ తురిమిన అల్లం వేసుకుని బాగా మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నిమ్మ రసం యాడ్ చేసుకుని సేవించాలి.ఈ సూపర్ డ్రింక్‌ను రోజుకు ఒక సారి తీసుకుంటే గనుక జలుబు తగ్గు ముఖం పడుతుంది.
దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలున్నా పోతాయి. """/" /
అలాగే ఉసిరి జ్యూస్ కూడా జలుబును నివారిస్తుంది.
రెండు లేదా మూడు ఉసిరి కాయలను తీసుకుని గింజలు తొలగించి రసం తీయాలి.
ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్‌లో ఉసిరి రసం, ఒక స్పూన్ నిమ్మ రసం, చిటికెడు నల్ల ఉప్పు, చిటికెడు నల్ల మిరియాల పొడి మిక్స్ చేసి తీసు కోవాలి.
రోజుకు ఒక సారి ఇలా తీసుకున్నా జలుబు నుంచి విముక్తి లభిస్తుంది.ఇక ఈ జ్యూసులతో పాటుగా జలుబు చేసినప్పడు రోజంతా గోరు వెచ్చటి నీటినే తీసుకునేందుకు ప్రయత్నించాలి.
రోజుకు ఒక సారి ఆవిరి పట్టాలి.సిట్రస్ ఫ్రూట్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.
పగటి పూట ఒక కప్పు పెరుగులో చిటికెడు మిరియాల పొడి వేసుకుని తీసుకోవాలి.
కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి.అప్పుడే జలుబు త్వరగా పోతుంది.