ఒక్క రాత్రిలో పెదాల ప‌గుళ్లు త‌గ్గాలా? అయితే ఇవిగో చిట్కాలు!

వింట‌ర్ సీజ‌న్‌లో స్టార్ట్ అయింది.ఈ సీజ‌న్‌లో పిల్లలు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో పెదాల ప‌గళ్ల స‌మ‌స్య‌ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, చలి, పొడిగాలి వంటి కార‌ణాల వ‌ల్ల పెద‌వులు ప‌గిలిపోయి అందవిహీనంగా మార‌తాయి.

దాంతో ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఏం చేయాలో అర్థంగాక తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే ఒకే ఒక్క రాత్రిలో పెదాల ప‌గుళ్ల‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో ఓ లుక్కేసేయండి.ప‌గిలిన పెదాల‌ను నివారించ‌డంలో కీర దోస అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

కొన్ని కీర దోస ముక్క‌ల‌ను తీసుకుని మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక స్పూన్ కీర దోస ర‌సం, ఒక స్పూన్ వెన్న వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని నైట్ నిద్ర పోవ‌డానికి రెండు గంట‌ల ముందు నుంచీ మూడు, నాలుగు సార్లు అప్లై చేసుకుంటే.

ఉద‌యానికి ప‌గుళ్లు త‌గ్గి పెదాలు మృదువుగా మార‌తాయి. """/" / అలాగే చిన్న గిన్నెలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్‌, ఒక‌ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ మ‌రియు మూడు విటమ‌న్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్ తీసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు ప‌ట్టించి స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా రాత్రి నిద్రించే ముందు చేస్తే.

ఉద‌యానికి ప‌గుళ్లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ఇక పెదాల ప‌గుళ్ల‌ను నివారించే మ‌రో అద్భుత‌మైన చిట్కా ఏంటంటే.

బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆలోవెర జెల్‌, రెండు పాలు వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

రాత్రి నిద్ర పోయే ముందు ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు ప‌ట్టించి.ఉద‌యాన్నే వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. .

‘మేమంతా సిద్ధం ‘ 19 వ రోజు జగన్   యాత్ర షెడ్యూల్