బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా పోవాలా? అయితే ఇలా చేయండి!
TeluguStop.com

బ్లాక్ హెడ్స్.ఎందరినో బాధిస్తున్న సమస్య ఇది.


గడ్డంపై, ముక్కుపై, బుగ్గలపై ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఏర్పడుతుంటాయి.దాంతో చర్మం ఎంత తెల్లగా, మృదువగా ఉన్నా.


కాంతిహీనంగా కనిపిస్తారు.హార్మోన్ల మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉండే క్రీములు వాడటం, పోషకాల లోపం, దుమ్ము, ధూళి, చర్మ సంరక్షణ లేకపోవడం, పలు రకాల మందుల వాడకం, డెడ్ స్కిన్ సెల్స్ ఇలా రకరకాల కారణాల వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి.
దాంతో వీటిని నివారించుకునేందుకు నానా ప్రయత్నిస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే.
బ్లాక్ హెడ్స్‌ను శాశ్వతంగా వదిలించుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయకుండా చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముల్తానీ మట్టి, బాదం పొడి మరియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా డే బై డే చేస్తూ ఉంటూ.క్రమంగా బ్లాక్ హెడ్స్ దూరం అవుతాయి.
"""/"/
అలాగే ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి.అందులో కొబ్బరి నూనె వేసి మరిగించాలి.
ఇప్పుడు ఈ నీటితో ముఖానికి అవిరి పట్టాలి.అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండే.బ్లాక్ హెడ్స్ పోవడమే కాదు ఇంకెప్పుడూ రాకుండా కూడా ఉంటాయి.
ఒక బౌల్ తీసుకుని.అందులో చందనం పొడి, పెసర పిండి, చిటికెడు పసుపు మరియు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి.పదిహేను, ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం తడి చేతులతో మెల్ల మెల్ల స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తూ ఉంటే.
బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా పోతాయి.