టీలు అధికంగా సేవించడం, బ్యాక్టీరియా పేరుకు పోవడం, పలు రకాల పోషకాల లోపం.
ఇలా రకరకాల కారణాల వల్ల నాలుకపై నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి.ఇవేమి మనకు ఇబ్బంది కలిగించక పోయినా.
ఇతరులతో మాట్లాడే సమయంలో అవి అసహ్యంగా కనిపిస్తుంటాయి.అందుకే వాటిని తగ్గించుకునేందుకు తెగ తాపత్రయ పడుతుంటారు.
ఇందులో భాగంగానే ఏవేవో మందులు వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే న్యాచురల్‌గానే నాలుకపై ఏర్పడిన నల్లటి మచ్చలను వదిలించుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం మరి ఆ చిట్కాలు ఏంటో చేసేయండి.పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అదే సమయంలో నాలుకపై నల్ల మచ్చలనూ పోగొడుతుంది.ప్రతి రోజు చిన్న పైనాపిల్ ముక్కను బాగా నమిలి నమిలి తింటూ ఉంటే కొద్ది రోజుల్లోనే నల్ల మచ్చలు తగ్గి పోతాయి.
అలాగే ఒక గ్లాస్ నీటితో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు లవంగాల పొడి వేసి బాగా మరిగించాలి.
ఆ తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా అవ్వనిచ్చి.అప్పుడు నోట్లో పోసుకుని బాగా పుక్కలించి ఉమ్మేయాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే నల్ల మచ్చలు క్రమంగా మటుమాయం అవుతాయి. """/" /
కలబంద కూడా నాలుకపై ఏర్పడిన నల్లటి మచ్చలను పోగొట్టగలదు.
కలబంద ఆకులను జెల్ తీసుకుని నాలుకపై అప్లై చేసుకోవాలి.కొద్ది సేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో మౌత్ వాష్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇక ఒక గిన్నె తీసుకుని అందులో గుప్పెడు వేపాకులు వేసి గ్లాస్ వాటర్ పోసి పది నిమిషాల పాటు మరిగించి.
ఫిల్టర్ చేసుకోవాలి.ఈ నీటితో ఉదయం, సాయంత్రం నోటితో పుక్కలిస్తే నాలుకపై వచ్చిన నల్ల మచ్చలు తగ్గు ముఖం పడతాయి.
రైలు బాత్రూమ్‌లో లవర్స్ ఘాటైన రొమాన్స్.. సోషల్ మీడియాలో వీడియో లీక్!