త‌ర‌చూ మూడ్ ఆఫ్ అవుతున్నారా..అయితే ఈ టిప్స్ మీకే?

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది త‌ర‌చూ మూడ్ ఆఫ్ అవుతుంటారు.

ఎవ‌రైనా తిట్టిన‌ప్పుడు, త‌మ‌ను చుల‌క‌న‌గా చూసిన‌ప్పుడు, ఒంట‌రిగా ఫీల్ అయిన‌ప్పుడు, కెరీర్ గురించి ఆందోళ‌న, కోరుకున్న‌ది ద‌క్క‌న‌ప్పుడు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మూడ్ ఆఫ్ అవుతూ ఉంటారు.

మూడ్‌ ఆఫ్ లో ఉంటే ఏ ప‌నీ చేయ‌లేరు.దేనిపైనా దృష్టి సారించ‌లేరు.

ఒత్తిడి పెరిగిపోతుంది.అందుకే మూడ్ ఆఫ్ నుంచి ఎంత త్వ‌ర‌గా రిలీఫ్ అయితే అంత మంచిద‌ని ఆరోగ్య నిపుణ‌లు చెబుతుంటారు.

మ‌రి అందుకు ఏం చేయాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.రోజుకు ఇర‌వై నిమిషాలు న‌డిస్తే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని అంద‌రికీ తెలుసు.

అయితే మూడ్‌ ఆఫ్ నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డంలోనూ న‌డ‌క అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అవును, మూడ్ ఆఫ్ అయిన‌ప్ప‌డు అలా కాసేపు న‌డిస్తే.

త్వ‌ర‌గా రిలీఫ్ అయిపోతారు.అలాగే మూడ్ ఆఫ్‌ను దూరం చేయ‌డంలో మ్యూజిక్ కూడా గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మంచి మంచి పాట‌లు వింటే మ‌న‌సులో ఉంటే బాధ ఇట్టే పోతుంది.

దాంతో మీరు ఉత్సాహంగా మ‌రియు ఉల్లాసంగా మార‌తారు. """/" / స్విమ్మింగ్ ద్వారా కూడా మూడ్ ఆఫ్ నుంచి బ‌య‌ట ప‌డొచ్చు.

అవును, మనసు బాగాలేనప్పుడు ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తే.

రిలీఫ్ అవుతారు.స్మిమ్మింగ్ చేసేందుకు అవ‌కాశం లేని వారు ష‌వ‌ర్ బాత్ చేసినా ఫ‌లితం ఉంటుంది.

ఒక్కోసారి శ‌రీరంలో శ‌క్తి కోల్పోయిన‌ప్పుడు కూడా మూడ్ ఆఫ్ అవుతారు.అయితే అలాంటి స‌మ‌యంలో పండ్ల ర‌సాలు, సూపులు తీసుకుంటే మ‌ళ్లీ మామూలు స్థితికి చేరుకుంటారు.

ఇక బొమ్మ‌లు గీయడం, మెడిటేషన్ చేయ‌డం, ఫ్యామిలీతో గ‌డ‌ప‌డ‌టం, పెట్స్‌తో ఆడుకోవ‌డం వంటి చేసినా మ‌న‌సు కుదిట‌ప‌డుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, గురువారం 2024