ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లో కావాలా? అయితే కాకరతో ఇలా చేయండి!
TeluguStop.com

ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లో కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి! దాదాపు అందరూ అందుకోసమే తాపత్రాయ పడుతుంటారు.


ఈ క్రమంలోనే రకరకాల ఫేస్ వాష్‌లు, క్రీములు వాడుతుంటారు.కానీ, న్యాచురల్ పద్ధతుల ద్వారా కూడా ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లోను పొందొచ్చు.


అందుకు కాకరకాయ గ్రేట్‌గా సహాయపడుతుంది.అవును, మీరు విన్నది నిజమే కాకరకాయే.
సహజంగా కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ.ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
అలాగే చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.మరి కాకరతో ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లో పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కాకరకాయ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఆ పేస్ట్‌లో కొద్దిగా జాజికాయ పొడి వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు పట్టించాలి.
పది నిమిషాల అనంతరం వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దుకుంటూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే మృతకణాలు, మలినాలు పోయి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
"""/" /
అలాగే కాకరకాయ మెత్తగా నూరి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఆ రసంతో కలబంద జెల్ మరియు తేనె వేసుకుసి కలిపి.
ముఖానికి పట్టించాలి.పది, పదిహేను నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేసినా కూడా ఇన్‌స్టెంట్ ఫేస్ గ్లో పొందొచ్చు.పైగా ఈ ప్యాక్ రెగ్యులర్‌గా వేసుకుని మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి.
ఇక కాకరకాయ ముక్కలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి.అందులో చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా.
ముఖం కాంతివంతంగా, మృదువుగా మెరిసిపోతుంది.
చిరంజీవి సినిమా వల్ల నా వ్యాధి బయటపడింది.. వైరల్ అవుతున్న ఇన్ స్టాగ్రామ్ రీల్!