మరి స్కిన్‌కు బెల్లాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బెల్లం తరుము, మూడు స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పెసర పిండి, ఒక స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకుని.
ఆపై ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవాలి.ఇరవై నిమిషాల పాటు డ్రై అయిన అనంతరం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేశారంటే పింపుల్స్, పింపుల్ మార్క్ పోయి ఫేస్ తెల్లగా మెరిసిపోతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బెల్లం తరుము, రెండు స్పూన్ల పచ్చి పాలు పోసి బాగా కలుపుకోవాలి.
"""/" / ఆ తర్వాత ఇందులో ముల్తానీ మట్టి యాడ్ చేసి మిక్స్ చేసుకుని.
ఫేస్ కు అప్లై చేసుకోవాలి.కాసేపు ఆరనిచ్చి అప్పుడు గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ ప్యాక్ వల్ల ముఖం తేమగా, మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది.ఇక బౌల్‌లో ఒక స్పూన్ బెల్లం తరుము మూడు స్పూన్ల వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల చందనం పొడి, ఒక స్పూన్ నిమ్మ రసం యాడ్ చేసుకుని కలిపి.
ఆపై ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అయిన అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే డార్క్ స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.మరియు నల్ల మచ్చలు తగ్గుతాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, శుక్రవారం 2025