స‌మ్మ‌ర్‌లోనూ స్కిన్ గ్లోగా ఉండాలా..అయితే ఇవి ట్రై చేయండి!

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో డీహైడ్రెష‌న్, అతిదాహం, నీరసం, వ‌డ‌దెబ్బ వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లే కాకుండా.

చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా అధికంగానే ఉంటాయి.వేడి వాతావ‌ర‌ణం, చెమ‌ట‌లు, ఎండ‌లు కార‌ణంగా నిగారింపు పోయి చ‌ర్మం కాంతిహీనంగా మారిపోతుంది.

చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం, ప‌గుళ్లు ఏర్ప‌డ‌టం కూడా జ‌రుగుతుంది.అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నిటికి చెక్ పెట్టి.

స‌మ్మ‌ర్‌లో స్కిన్ గ్లోగా మారాలీ అంటే ఖ‌చ్చితంగా కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.స‌మ్మ‌ర్‌లో స్కిన్ గ్లోయింగ్‌కు బీట్‌రూట్ గ్రేట్‌గా స‌మాయ‌ప‌డుతుంది.

ఒక బౌల్‌లో బీట్‌రూట్ గుజ్జు, పెరుగు, నిమ్మ ర‌సం మ‌రియు బ్రౌన్ షుగ‌ర్ పౌడ‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పే నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో వాష్ చేసుకోవాలి.

ఇలా డే బై డే చేస్తూ ఉంటే.మృత‌క‌ణాలు పోయి స్కిన్ కాంతివంతంగా మారుతుంది.

ఈ ప్యాక్ వ‌ల్ల ట్యాన్ స‌మ‌స్య కూడా దూరం అవుతుంది. """/" / అలాగే ఒక బౌల్‌లో తుల‌సి ఆకుల పేస్ట్‌, వేప ఆకుల పేస్ట్ మ‌రియు నిమ్మ ర‌సం వేసి క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు కావాల‌నుకుంటే చేతుల‌కు అప్లై చేసుకుని.పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే.ప‌గుళ్లు త‌గ్గి చ‌ర్మం మృదువుగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

మొటిమ‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.రాత్రంతా కుంకుమ పువ్వును నాన‌బెట్టిన వాట‌ర్ ఒక స్పూన్‌, పాలు ఒక స్పూన్‌, బాదం ఆయిల్ అర స్పూన్ తీసుకుని గిన్నెలో వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.బాగా ఆర‌నివ్వాలి.

అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.

డార్క్ నెస్‌ దూర‌మై చ‌ర్మం తెల్ల‌గా, గ్లోగా మారుతుంది.

మరింత భారం కానున్న రీఛార్జిలు.. నిన్న జియో, నేడు ఎయిర్టెల్.. ఇకబాదుడే..