ఒక్క‌రాత్రిలో ముఖం గ్లోయింగ్‌గా మారాలా? అయితే ఈ చిట్కాను ట్రై చేయండి!

ముఖం తెల్ల‌గా ఉంటే అందంగా ఉన్న‌ట్లు కాదు.రంగు ఏదైనా చ‌ర్మం కాంతివంతంగా ఉండాలి.

అప్పుడే అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తారు.అందుకే స్కిన్‌ను గ్లోయింగ్‌గా మార్చుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీమ్స్‌, సీర‌మ్స్‌, ఫేస్ మాస్క్‌ల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

వాటి వ‌ల్ల ప్ర‌యెజ‌నాలు ఎన్ని ఉంటాయో తెలియ‌దు గానీ.ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాను ట్రై చేస్తే మాత్రం కేవ‌లం ఒక్క‌రాత్రిలోనే ముఖం గ్లోయింగ్‌గా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి.

దానికి ఉండే తొక్క‌ల‌ను వేరు చేయాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో వేరు చేసి పెట్టుకున్న ఆరెంజ్ పండు తొక్కలు, ఒక క‌ప్పు ప‌చ్చి పాలు వేసుకుని నాలుగైదు గంటల పాటు నాన‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న ఆరెంజ్ పండు తొక్క‌ల‌ను పాల‌తో స‌హా వేసుకుని మెత్త‌టి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుండి జ్యూస్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల చంద‌నం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ప‌సుపు, నాలుగు చుక్క‌లు కుంకుమాది తైలం వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్ర‌ష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని కాస్త ఆరిన త‌ర్వాత నిద్రించాలి.

"""/" / ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ సింపుల్ చిట్కాను గ‌నుక పాటిస్తే కేవ‌లం ఒక్క‌రాత్రిలోనే ముఖం గ్లోయింగ్‌గా, ఎట్రాక్టివ్‌గా మారుతుంది.

అలాగే ఈ రెమెడీని త‌ర‌చూ ట్రై చేస్తుంటే.మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి.

స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.

ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య గొడవ ఏంటి ? 20 ఏళ్లు ఎందుకు మాట్లాడుకోలేదు ?