మీ క‌ళ్ళు ఆక‌ర్ష‌ణీయంగా మారాలా? అయితే ఈ టిప్స్ ట్రై చేయాల్సిందే!

కండ్లు ఆక‌ర్షణీయంగా ఉంటే అందం పెర‌గ‌డ‌మే కాదు, ఎవ్వ‌రైనా ఇట్టే ఎట్రాక్ట్ అవుతుంటారు.

అంతేకాదు, కొంద‌రు కండ్లను చూసే ప్రేమ‌లో కూడా ప‌డుతుంటారు.ఇక కండ్లపై ఎన్ని క‌విత‌లు ఉన్నాయో, మ‌రెన్ని పాట‌లు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

  అంద‌రూ త‌మ కండ్లు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు.కానీ, నేటి ఆధునిక కాలంలో చాలా మంది కండ్లు క‌ళ‌ త‌ప్పి ఉంటున్నాయి.

ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్ వాడ‌టం, నిద్ర‌లేమి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్లకండ్లు కాంతిహీనంగా మారుతున్నాయి.

అయితే ఆకర్షణీయంగా మ‌రియు మనోహరంగా కండ్లు ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా కండ్లు వ‌ద్ద ముడ‌త‌లు ఏర్ప‌డుతుంటాయి.

వీటి వ‌ల్ల కండ్లు అంద‌హీనంగా క‌నిపిస్తాయి.అయితే పాల మీగ‌డ తీసుకుని కండ్లు పై మ‌రియు చుట్టూ అప్లై చేసుకుని వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్దుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు చేసి ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే క‌ళ్ళు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా మార‌తాయి.

ఉప్పును కండ్లు ను మెరిపించుకోవ‌చ్చు.కొద్దిగా వాట‌ర్ తీసుకుని అందులో స‌ముద్ర‌పు ఉప్పు వేసి క‌రిగించాలి.

ఇప్పుడు ఈ ఉప్పు నీటితో కండ్లను శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే కండ్లు ప్ర‌కాశ‌వంతంగా మార‌తాయి.

"""/" / న‌ల్ల‌టి వ‌ల‌యాల వ‌ల్ల కూడా కండ్ల కాంతి త‌గ్గుతుంది.అయితే ట‌మాటా ర‌సం తీసుకుని అందులో నిమ్మ ర‌సం యాడ్ మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్నికండ్ల చుట్టూ అప్లై చేసి ఇర‌వై నిమిషాల అనంత‌రం క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే వ‌ల‌యాలు త‌గ్గి.కండ్లు కాంతివంతంగా మార‌తాయి.

ఇక ఈ టిప్స్‌తో పాటు వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు తీసుకోవాలి.

ఆయిల్ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్ త‌గ్గించాలి.ప్ర‌తి రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌లు నిద్రించాలి.

అప్పుడే కండ్లు ఆక‌ర్ష‌ణీయంగా మార‌తాయి.

రైలులో వ్యక్తికి గుండెపోటు.. సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన టీటీఈ (వీడియో)