కేవలం ఈ రెండు ఉంటే చాలు మీ జుట్టు రెండింతలు అవుతుంది..!
TeluguStop.com
మీ జుట్టు మరీ పల్చగా ఉందా.? కురులను ఒత్తుగా మార్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారా.
? కానీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదా.? అయితే ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే.
ఇది చాలా సింపుల్ రెమెడీ అయినప్పటికీ.జుట్టును( Hair ) ఒత్తుగా మార్చడానికి మాత్రం ఎంతో పవర్ ఫుల్ గా పని చేస్తుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి.మునగాకు.
దీని గురించి పరిచయాలు అక్కర్లేదు.పోషకాల నిలయమైన మునగాకు( Munagaku ) మూడు వందల రోగాలకు చెక్ పెడుతుందని అంటుంటారు.
అది అక్షరాల సత్యం.వారానికి కనీసం ఒక్కసారి మునగాకును తీసుకున్నా అనేక జబ్బులకు దూరంగా ఉండొవచ్చు.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా మునగాకు ఉపయోగపడుతుంది.అలాగే మరొక పవర్ ఫుల్ ఇంగ్రీడియెంట్ కలబంద( Aloe Vera ).
దాదాపు అందరి ఇంటి పెరట్లోనూ ఉండే కలబంద.జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా తోడ్పడుతుంది.
"""/" /
కాబట్టి, మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు లేత మునగాకు వేసుకోండి.
అలాగే ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. """/" /
మునగాకు మరియు కలబంద జుట్టును రెండింతలు చేయడానికి అద్భుతంగా సహాయపడతాయి.
ఈ రెండింటిని కలిపి వారానికి ఒకసారి ప్యాక్ మాదిరి వేసుకుంటే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే ఒత్తుగా మారుతుంది.
పొడుగ్గా పెరుగుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.
అలాగే చుండ్రు సమస్య సైతం దూరం అవుతుంది.కాబట్టి దట్టమైన కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
యంగ్ హీరోలలో శ్రీవిష్ణును ఎంత మెచ్చుకున్నా తక్కువేనా.. ఎందుకంటే?