Love Today : యూత్ చేసే తప్పులను సినిమాగా తీస్తే చాలు..హిట్టు కొట్టడం గ్యారంటీ !
TeluguStop.com
ఈ మధ్య కాలంలో జనాలను థియేటర్ కి రప్పించడం ఎంత పెద్ద టాస్క్ అనే విషయం అందరికి తెలిసిందే.
ఏ సినిమా అయినా యూత్ థియేటర్ కే వస్తేనే హిట్ అవుతుంది.ఆ యువత మనసులను గెలుచుకోవాలంటే వారు చేసే తప్పులు, లేదా ఎదుర్కొంటున్న సమస్యలు, పడుతున్న బాధలను సినిమాగా తీస్తే సరిపోతుంది అని నిరూపిస్తున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బేబీ మూవీ( Baby Movie ) గురించి.ఈ సినిమాలో ప్రతి వ్యక్తి ప్రేమ విషయంలో ఎలా మోసపోతున్నాడు, అమ్మాయిలు ఎలాంటి పరిస్థితిలో తప్పులు చేస్తున్నారు అనే విషయాన్నీ చాల చక్కగా దర్శకుడు సాయి రాజేష్( Sai Rajesh ) చూపించాడు.
అందుకే ఇంత వర్షాలు పడుతున్న, కొత్త నటీనటులతో సినిమా తీసిన కూడా పెద్ద హిట్టు కొట్టడం మాత్రమే కాదు ఆ సినిమాను ఆదర్శంగా తీసుకొని చాల సినిమాలు తెరకెక్కుతున్నాయి.
ఈ సినిమాలో నటించిన వైష్ణవి కి మంచి మార్కులే పడ్డాయి. """/" /
ఇక ఇదే దోవలో లవ్ టుడే అనే సినిమా కూడా వచ్చింది.
ఈ సినిమా 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ ( Pradeep Ranganathan )హీరో గా తొలిసారి నటించాగా తానే ఈ చిత్రానికి దర్శకుడిగా కూడా వ్యవహరించాడు.
ఇది అతడి దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా.ఇక ఈ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే మొబైల్ ఫోన్స్ మన జీవితంలో ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తున్నాయి చాల చక్కగా దర్శకుడు చుపించాడు.
తమిళ్ లో వచ్చిన ఈ సినిమా లో తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి వసూళ్లను సాధించింది.
ఈ సినిమా కాన్సెప్ట్ సైతం యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. """/" / హీరో హీరోయిన్స్ ఇద్దరు తమ మొబైల్స్ ని ఒకరికి ఒకరు ఒక రోజు కోసం మార్చుకుంటారు.
అందువల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది అని అనుకుంటారు కానీ ఆ ఒక్క రోజులోనే వారి జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయి అనే విషయాన్నీ యూత్ బాగా రిసీవ్ చేసుకున్నారు.
ఇలా యువత యొక్క ఆలోచనలకూ దగ్గరగా సినిమా తీస్తే చాలు కోట్ల బడ్జెట్ తో పని లేదు.
ఈజీ గా బ్లాక్ బస్టర్ కొట్టచ్చు.
మధుమేహులే కాదు సపోటా పండ్లు వారు కూడా తినకూడదని మీకు తెలుసా..?