పిల్లలకు పాలు పట్టించే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం

అప్పుడే పుట్టిన పిల్లల నుండి కనీసం సంవత్సరం వయస్సు వచ్చే వరకు పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.

ఈ విషయంను పెద్దలు చెప్పడంతో పాటు వైధ్యులు, చివరకు ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.

అప్పుడే పుట్టిన పిల్లలకు కోట్ల రూపాలు ఖర్చు చేసి ఆహారం అందించినా కూడా ఫలితం ఉండదు.

అమ్మ పాలు అమృతం అంటారు.ఈ విషయంను శాస్త్రవేత్తలు అధికారికంగా చెప్పారు.

తల్లి పాలు పిల్లలకు అమృతంతో సమానం.అయితే కొన్ని సార్లు అమ్మ పాలే పిల్లల పాలిట ప్రమాదం అవుతాయి.

"""/"/ తల్లి పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

అలా జాగ్రత్తలు తీసుకోకుంటే పిల్లలు ఊపిరి ఆడక ఇబ్బంది పడతారు.ముఖ్యంగా పాలు పట్టించే సమయంలో పిల్లల పొజీషన్‌ చూసుకోవాలి.

తల పైకి ఉండి బాడీ మొత్తం తల కంటే కిందకు ఉండాలి.అంటే ఏట వాలుగా ఉండాలి.

పాలు పట్టించే సమయంలో తల కంటే పిల్లల బాడీ కాళ్లు పైకి ఉంటే పిల్లలకు పాలు పొర పోయే అవకాశం ఉంది.

స్వర పేటికలోకి పాలు వెళ్లి ఉపిరి ఆడకుండా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

"""/"/ ముఖ్యంగా మూడు నెలలు లోపు పిల్లల పాలు పట్టించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

వారిని పడుకోబెట్టి కంటే ఎక్కువ ఎత్తుకుని ఒల్లో పెట్టుకుని పాలు ఇవ్వడం మంచిది.

పాలు ఇచ్చిన తర్వాత తప్పని సరిగా మూడు నుండి అయిదు నిమిషాల పాటు పిల్లలను బుజం మీద వేసుకుని ఉండాలి.

అలా అయితే మొత్తం పాలు కూడా ఆహార కేంద్రంలోకి చేరుతాయి.పడుకున్న సమయంలో పిల్లలకు పాలు ఇచ్చినా కూడా కాస్త తల భాగం ఎత్తుగా ఉండేలా చూసుకుంటే మంచిది.

ఇక పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లులు అస్సలు మాట్లాడవద్దని పెద్దలు అంటూ ఉంటారు.

పాలు ఇస్తూ మాట్లాడితే పిల్లలకు పొర పోతుందట. """/"/ తల్లి పాలు పసి పిల్లలకు అమృతంతో సమానం, అలాంటి అమృతంను ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అదే విషం అవుతుంది.

అందుకే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.ప్రతి ఒక్క తల్లికి ఉపయోగపడే ఈ విషయాన్ని తప్పకుండా షేర్‌ చేయండి.

రాజమౌళి మహేష్ బాబు సినిమా కి స్టార్టింగ్ ట్రబుల్ అవుతుందా..?