చలికాలంలో వేధించే విటమిన్-డి లోపానికి సులభంగా ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మందిని వేధించే సమస్యల్లో విటమిన్ డి లోపం ముందు వరుసలో ఉంటుంది.

విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు బ‌ల‌హీనంగా మార‌డం, గుండె జబ్బులు, డిప్రెషన్, బరువు తగ్గడం లేదా పెరగడం, కండరాల నొప్పులు, అలసట, నీరసం తదితర సమస్యలన్నింటినీ ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అందుకే విటమిన్ డి లోపాన్ని వీలైనంత త్వరగా నివారించుకునేందుకు ప్రయత్నించాలి.అయితే చలికాలంలో వేధించే విట‌మిన్ డి లోపానికి సులభంగా చెక్ పెట్టడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి సూర్యరశ్మి ఉత్తమ ఎంపిక.ఎంత బద్ధకం గా ఉన్నా సరే ఉదయం ఎండలో కనీసం అరగంట అయినా ఉండాలి.

తద్వారా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.మీరు పని చేసే చోట కూడా వీలైనంత వరకు సూర్య కాంతి పడేలా చూసుకోండి.

తద్వారా మీ శరీరంలో విటమిన్ డి అభివృద్ధి అద్భుతంగా సాగుతుంది.అలాగే ప్రస్తుత వింటర్ సీజన్ లో వారానికి రెండు సార్లు అయినా సముద్ర ఆహారాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాలి.

చేపలు, రొయ్యలు, పీతలు తదితర సీ ఫుడ్ ను తీసుకుంటే శరీరానికి అవసరం అయ్యే విటమిన్ డి లభిస్తుంది.

చలికాలంలో గేదె పాలు కంటే ఆవు పాలు తాగడానికి ప్రయత్నించాలి.ఆవు పాలను తీసుకోవడం వల్ల విటమిన్ డి తో పాటు చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

మరియు రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. """/"/ అంతేకాదు నారింజ రసం, గుడ్లు, పుట్టగొడుగులు, సోయా ఉత్పత్తులు, పెరుగు, తృణధాన్యాలను డైట్ లో చేర్చుకోవాలి.

ఈ ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాదు విటమిన్ డి లోపాన్ని సైతం నివారిస్తాయి.

కాబట్టి ఎవరైతే ఈ చలికాలంలో విటమిన్ డి లోపానికి గురయ్యారో వారు తప్పకుండా పైన చెప్పిన ఆహారాల‌ను డైట్ లో చేర్చుకోండి.

జాక్ మూవీకి ఫ్లాప్ టాక్.. హీరో సిద్ధు జొన్నలగడ్డ అలా చేస్తే బెటర్ అంటూ?