నిత్య పూజ ఎలా చేయాలి.. సనాతన ధర్మం ఏం చెబుతుందో తెలుసా..?

హిందూ సనాతన ధర్మం( Hindu Orthodoxy ) ప్రకారం మన దేశంలో చాలా మంది ప్రజలు తమ తమ ఇంట్లో ప్రతి రోజు పూజలు చేస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే భగవంతుని ముందు దీపం వెలిగించని ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెబుతోంది.

మానవ జన్మ ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ ఫలితాలను సిద్ధింప చేసుకునే మార్గం అని పండితులు చెబుతున్నారు.

ఈ సంకల్పాలు నెరవేరాలంటే భగవానుగ్రహం తప్పకుండా ఉండాలి.అందుకు ప్రతిరోజు పూజ చేస్తూ ఉండాలి.

దీనికోసం విధి విధానాలు శాస్త్రం వివరిస్తుందని పండితులు చెబుతున్నారు.భక్తి అనేది ఒక సమర్పణ భావన భక్తికి తొలిమెట్టుగా మనం పూజను భావించవచ్చు.

అలాంటి పూజకు ఒక విధి విధానం కచ్చితంగా ఉంటుంది.అదేమిటో తెలుసుకుని దాని ప్రకారం ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఆ భగవంతుడితో అనుసంధానమై ఉండవచ్చు అని పండితులు చెబుతున్నారు.

మరి నిత్య పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆత్మశుద్ధి కలిగించేది ఆసనం.

అనారోగ్యాన్ని దూరం చేసేది, కొత్త సంకల్పాలను నెరవేర్చేది, నవసిద్ధులను సిద్ధింపజేసేది ఆసనం.నిలబడి పూజ చేయకూడదు.

"""/" / చక్కగా కూర్చొని పూజ చేయాలి.పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం.

కనుక పూజలో తర్పణ తప్పనిసరి.గంధం( Sandalwood ) అంతులేని దౌర్భాగ్యాన్ని కష్టాన్ని దూరం చేస్తుంది.

ధర్మ జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి ఈ గంధం కూడా తప్పకుండా పూజలు ఉపయోగిస్తారు.

అక్షత అంటే పవిత్రమైనదని అర్థం.కల్మషాలను పోగొట్టేవి కానుక అక్షతలు కూడా పూజా ద్రవ్యాల్లో ఉండాలి.

పుష్పం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇస్తుంది.కాబట్టి పువ్వులేని పూజ పూర్తి కాదని పండితులు చెబుతున్నారు.

భగవంతుడికి కనీసం ఒక్క పువ్వు అయిన సమర్పించాలి. """/" / ధూపం దుర్వాసనను పోగొట్టి ఒక చక్కని పవిత్ర పర్యావరణాన్ని సృష్టించింది.

కాబట్టి ధూపాన్ని కూడా తప్పనిసరిగా భగవంతుడికి సమర్పించాలి.పాదాలు శుభ్రం చేసుకోవడానికి ఇచ్చే జలన్ని పాదోపాద్యం అంటారు.

దీపం అజ్ఞాన అందాకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును మన ఆత్మకు అందించేది.అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేలుకొలిపే సాధనం.

ఏం చేసినా లేకపోయినా దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవడం వల్ల సమస్త బాధలు దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.

కోతి-కింగ్ కోబ్రా స్నేహం.. ఏకంగా మెడలో వేసుకొని.. వీడియో వైరల్