దూరంగా ఉన్నవ్యక్తి పేరుతో గ్రహశాంతి, జప, హోమాది క్రియలు ఎలా చేయాలి?

స్థానికంగా లేనటువంటి వ్యక్తుల విద్యా, ఉద్యోగ కరాణాలుగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో ఉన్నప్పుడు ఆ వ్యక్తుల జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉండి, వాటికి శాంతి క్రియలు చేయవలసి వస్తే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువులు లేదా ఆత్మీయులు, మిత్రులు సంకల్ప పూర్వకంగా మంచి పండితులతో జప, తర్పణ, హోమాది కార్యక్రమ ములు నిర్వర్తించ వచ్చును.

ప్రారంబ సమయంలో ఎవరి పేరుతో శాంతి క్రియలు చేస్తున్నారో వారి పేరు, గోత్రము ఉదహరిస్తూ వారు ఇచ్చటలేని సందర్భముగా వారి తరఫున నేను చేస్తున్నాను అని సంకల్పం చేయాలి.

ప్రతి రోజు జప కార్యక్రమ సందర్భముగా చివరిలో హోమ సందర్భముగా ఇచ్చే తీర్థమును కాశీ విభూదిలో వేసి, భద్రపరచ వచ్చును.

నిత్యము పూజ చేసిన తీర్థము విభూదిలో వేస్తూ ఉండటం వలన అందులో ఆ ఫలం ఉండును.

చివరలో ఆ విభూదిని పూజ ఎవరి పేరుతో చేస్తున్నామో వారికి పంపవలెను.అచ్చట వారు వారి గృహమందు దేవతా మూర్తుల ఎదుట కొబ్బరి కాయ కొట్టి, ఆ నీటిలో ఈ విభూదిని కలిపి ముందుగా కొంచెం తలపై చల్లుకొని, తదుపరి మూడు సార్లు తీర్థం తీసుకోవాలి.

ప్రసాదం, పండ్లు నిలువ ఉండవు కాబట్టి, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, జీడి పప్పు, బాదం పప్పు, పట్టి బెల్లం వీటిలో ఏదో ఒకటి పండవు పూజా ప్రసాదం పంపదలిస్తే కొబ్బరి పూజా సమయంలో నివేదన చేసి, చివరలో దానం కూడా పూజ ఎవరికైతే చేస్తున్నామో వారి గోత్ర, నామాలతో గ్రహశాంతు సంకల్పంచేసి ఇవ్వాలి.

పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రివ్యూ.. బన్నీ ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేదా?