అరటి తోటలను ఆశించే సిగటోక తెగులను నివారించే పద్ధతులు..!

అరటి మొక్కలను( Banana ) ఆశించే పసుపు మరియు నలుపు సిగటోక తెగులు ఫంగస్ వల్ల సోకుతుంది.

ఈ తెగులు పంటను ఆశిస్తే తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఈ ఫంగస్ చల్లని వాతావరణంలో, చాలా వెచ్చని వాతావరణంలో ఉండే చనిపోయిన లేదా జీవించి ఉన్న మొక్కల కణజాలాలపై జీవిస్తూ బీజాలను విడుదల చేస్తుంది.

ఈ తెగుల వ్యాప్తి కు మరొక మార్గం తెగులు సోకిన మొక్క వ్యర్ధాలు మొక్కల చెత్త లేదా తెగులు సోకిన పండ్లను రవాణా చేయడం వల్ల వ్యాప్తి చెందుతుంది.

"""/" / అరటి మొక్కల ఆకులపై ఈ సిగటోక( Sigatoka ) ఫంగస్ లక్షణాలను గమనించవచ్చు.

చిన్న, లేత పసుపు రంగు మచ్చలు ఆకులపై గమనించవచ్చు.ఈ మచ్చలు వృద్ధి చెంది గోధుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగు మచ్చలుగా ఏర్పడతాయి.

ఆకులలో పగుళ్లు రావడం మొదలై ఆకులు చిరిగిపోయినట్లు కనిపిస్తాయి.ఈ తెగులు పంటను ఆశించకుండా ఉండాలంటే.

తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.మొక్కల మధ్య దూరం ఉంటే వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించవు.

సూర్యరశ్మి, గాలి మొక్కలకు సరిగా అందకపోతే ఈ తెగుళ్లు ఆశిస్తాయి.ఓవర్ హెడ్ ఇరిగేషన్ ను వాడకూడదు.

పొలంలోనే కాకుండా పొలం చుట్టూ ఉండే గట్లపై కూడా కలపు మొక్కలను తొలగించాలి.

"""/" / పొటాషియం ఉండే ఎరువులను అధికంగా వెయ్యడం వల్ల కూడా ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.

భూమిలో ఫంగస్ ఎదుగుదల ఆగాలంటే నత్రజనిని యూరియాతో కలిపి వేయాలి.తెగులు సోకిన ఆకులను కత్తిరించి పొలం బయటకు తీసుకువెళ్లి కాల్ చేయాలి.

ఆ తర్వాత రసాయన పిచికారి మందులైన క్లోరోతలోనిల్ కలిగిన శీలింద్ర నాశినులను పిచికారి చేయాలి.

పోప్రికొనజోల్, ఫెన్బుకొనజోల్ లను పిచికారి చేసి తొలి దశలోనే తెగులను అరికట్టాలి.

భారతీయులకు గుడ్ న్యూస్.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చని తెలుసా?