ఆయిల్ కంట్రోలింగ్‌కు ఆరెంజ్ పీల్ పౌడర్.. ఎలా వాడాలంటే?

సాధార‌ణంగా జిడ్డు చ‌ర్మ త‌త్వం క‌లిగిన‌ వారు.ఎన్ని క్రీములు, లోష‌న్లు వాడినా ఆయిల్ కంట్రోల్ అవ్వ‌దు.

మేక‌ప్ వేసుకున్న‌ కొన్ని గంట‌ల‌కే.స్కిన్ జిడ్డు జిడ్డుగా మారిపోతుంది.

ఇక స్కిన్‌పై ఆయిల్ అధికంగా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల మొటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మం సమస్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

దాంతో ఏం చేయాలో తెలియ‌క‌.ఎలా ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవాలో అర్థం గాక.

తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే ఆయిల్ కంట్రోలింగ్‌కు ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆరెంజ్ పీల్ పౌడ‌ర్‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని.

అందులో ఒక స్పూన్ చ‌ప్పున ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ మ‌రియు క‌ల‌బంద జెల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం త‌డి చేతుల‌తో మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ.కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే.చ‌ర్మంపై అధికంగా ఆయిల్ ఉత్ప‌త్తి అవ్వ‌డం త‌గ్గుతుంది.

దాంతో మీ స్కిన్ ఫ్రెష్‌గా, కాంతివంతంగా క‌నిపిస్తుంది. """/" / అలాగే ఆరెంజ్ పీల్ పౌడ‌ర్‌, పెరుగు మ‌రియు బాదం పేస్ట్.

ఈ మూడిటిని ఒక గిన్నెలో తీసుకుని బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.

పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా ఆయిల్ కంట్రోల్ అవుతుంది.

మ‌ర‌యు చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.ఇక ఆరెంజ్ పీల్ పౌడ‌ర్‌లో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి.ప‌ది నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా అధిక జిడ్డు స‌మ‌స్య త‌గ్గి.చ‌ర్మం గ్లోగా మ‌రియు అందంగా క‌నిపిస్తుంది.

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ మొత్తం వారికి విరాళంగా ప్రకటించిన బేబక్క?