ప్రెగ్నెన్సీ టైమ్ లో బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
TeluguStop.com
ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీ( Pregnancy ) టైం ఎంతో ప్రత్యేకమైనది.అందులోనూ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఎన్నో కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.
అయితే మామూలు సమయం తో పోలిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎన్నో నియమాలు పాటించాలి.ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో బీపీ(రక్తపోటు)ని కంట్రోల్ లో ఉంచుకోవాలని డాక్టర్లు పదే పదే చెబుతుంటారు.
బీపీ అదుపులో లేకుంటే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదంగా మారుతుంది.అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అందువల్లనే రక్తపోటు( Blood Pressure )ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
అందుకు కొన్ని కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.అవేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే అవి శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేస్తాయి.
దీని కారణంగా రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.అందుకే గర్భిణీలు ఉప్పును చాలా మితంగా తీసుకోవాలి.
"""/"/
అలాగే ప్రాసెస్ చేసిన చికెన్, జంక్ ఫుడ్( Junk Food ), వేయించిన ఆహారాలు కారణంగా కూడా రక్తపోటు పెరుగుతుంది.
కాబట్టి ఇలాంటి ఆహారాలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి.కంటినిండా నిద్ర( Sleep ) లేకపోయినా సరే రక్తపోటు అదుపు తప్పుతుంది.
అందుకే కంటికి సరిపడా నిద్ర, శరీరానికి అవసరం అయ్యే విశ్రాంతిని అందించాలి.విటమిన్ సి రక్తపోటును అదుపులో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది.
కాబట్టి విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకోవాలి.
"""/"/
రక్తపోటును అదుపులో ఉంచడానికి గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) కూడా అద్భుతంగా సహాయపడతాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు తినాలి.
ఇలా చేస్తే రక్తపోటు అదుపులో ఉండడమే కాదు ఎన్నో విలువైన పోషకాలు సైతం లభిస్తాయి.
ఇక గర్భిణీలు చేపలు ఎక్కువగా తీసుకుంటే మంచిదంటారు.కానీ వాటిలో కొన్ని తినకూడనివి ఉంటాయి.
అందుకే వైద్యుల సలహాతో అలాంటివి దూరం పెట్టాలి.ఒమెగా- 3( Omega 3 ) ఎక్కువగా, మెర్క్యురీ లేని చేపలను ఎంచుకుని ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable