చెవులు శభ్రపరుచుకోవాల్సిన మంచి పద్ధతులు

చెవులు శభ్రపరుచుకోవాల్సిన మంచి పద్ధతులు

చెవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి.చాలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి.

చెవులు శభ్రపరుచుకోవాల్సిన మంచి పద్ధతులు

చెవిలో గులిమి ఉంటే చూడ్డానికి బాగా అనిపించకపోవచ్చు.మన శరీరం ఎప్పటికప్పుడు ఇయర్ వ్యాక్స్ విడుదల చేస్తూనే ఉంటుంది.

చెవులు శభ్రపరుచుకోవాల్సిన మంచి పద్ధతులు

ఇది మన చెవిని రక్షించడానికే శరీరం చేసే పని.కాబట్టి చెవుల్లో గులిమి, ఏదైనా చెత్త ఉంటే శుభ్రం చేసుకోవడంలో తప్పు లేదు.

కాని ఎలా పడితే అలా శుభ్రపరుచుకోకూడదు.చెప్పాంగా, చెవులు చాలా సెన్సిటివ్ అని.

ఏమాత్రం తేడా కొట్టినా, మీ చెవులకి, వినికిడి శక్తికి ప్రమాదం.కాబట్టి చెవులని ఎలా శుభ్రపరుచుకోవాలో కొన్ని చిట్కాలు చెబుతున్నాం చూడండి.

* గోరువెచ్చని నీరు చెవుల్లోని పాత గులిమి, బ్యాక్టీరియాని ఈజీగా తొలగిస్తుంది.కొన్ని గోరువెచ్చని నీటి చుక్కలని చెవిలో వేసుకోని, తలవంచి కాటన్ బాల్స్ తో శుభ్రం చేసుకోండి.

* రబ్బింగ్ ఆల్కహాల్, వెనిగర్ ని కలిపి ఓ మిశ్రమంలా తయారుచేసుకోని, కాటన్ బాల్స్ ని ముంచి, చెవుల్ల చుక్కలు పోసుకొని, ఆ ఐదారు నిమిషాల తరువాత శుభ్రం చేసుకోండి.

* ఆలీవ్ ఆయిల్ కూడా చెవులో గులిమి, చెత్తను తొలగిస్తుంది.కాటన్ బాల్స్ తో కొన్ని చుక్కలు పోసుకొని, ఓ పది నిమిషాలు అలానే ఉంచుకోని మెల్లిగా శుభ్రం చేసుకోండి.

"""/"/ * సెలైన్ వాటర్ కూడా చెవుల్ని శుభ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు తెలుసా? సెలైన్ వాటర్ లో కాటన్ బాల్స్ ముంచి, చెవుల్లో చుక్కులు వేసుకోని ఓ పదిహేను నిమిషాలు అలానే ఉంచి, ఆ తరువాత కాటన్ తో తుడుచుకోండి.

!--nextpage * హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా సలువుగా గులిమిని కరిగించి బయటకి తెస్తుంది.నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి చుక్కలు చెవులో వేసుకోని పది-పదిహేను నిమిషాలు అలానే ఉంచి, ఆ తరువాత కాటన్ బాల్స్ తో శుభ్రం చేసుకోండి.

* మన తెలుగు ఇళ్ళలో వాడే చిట్కానే ఇది.కొబ్బరినూనెని కూడా చెవులు శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించవచ్చు.

కొన్ని చుక్కలు చెవిలో వేసుకోని పదిహేను నిమిషాలు ఓపిగ్గా ఉండి కడిగేసుకుంటే చాలు.

* రెండు చెంచాల నీటిలో పావు చెంచాడు బేకింగ్ సోడా కలుపుకోని, 3,4 చుక్కలు చెవిలో వేసుకోని పదిహేను నిమిషాలు అలానే ఉంచి కడిగేసుకోండి.

* గ్లిజరీన్ కూడా సలువుగా గులిమిని తలగిస్తుంది.కాటన్ బాల్స్ తో గ్లిజరీన్ చుక్కలు వేసుకోని కేవలం 5 నిమిషాలు ఉంచినా చాలు, గ్లిజరీన్ తన పని తను చేసుకుంటుంది.

* ఎప్పుడూ కూడా ఇనుముతో చేసిన వస్తువలు చెవిలో ఉపయోగంచవద్దు.ఈ చిట్కాలను పాటిస్తూ కేవలం కాటన్ బాల్స్ ఉపయోగించండి.

రిస్క్ ఎందుకు అనిపిస్తే డాక్టర్ దగ్గరికే వెళ్ళండి.

హిట్3 థియేట్రికల్ బిజినెస్ లెక్కలివే.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తే మాత్రమే మూవీ హిట్!