మీరు వాడే వంట నూనె మంచిదేనా? కాదా? ఇలా తెలుసుకోండి!
TeluguStop.com
ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారాలపైనే కాదు.ఆ ఆహారాలను తయారు చేసే నూనెపైన కూడా ఆధార పడి ఉంటుంది.
మంచి నాణ్యమైన వంట నూనెను వాడినప్పుడే మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.కానీ, ఈ మధ్య కాలంలో కొందరు మోసగాళ్లు వంట నూనెలను సైతం కల్తీ చేసేస్తున్నారు.
అటువంటి నూనెలు వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుస్తాయి.ముందు గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తలుపు తడతాయి.
అందుకే వంట నూనె మంచిదా.? లేక కల్తీదా.
? అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకున్నాకే వాడుకోవాలి.మరి ఇంతకీ మంచి వంట నూనెను కనుగోవడం ఎలా.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.మీరు కొనుగోలు చేసిన నూనెను వంటకు వాడే ముందు కొద్దిగా నాలుకపై వేసుకుని రుచి చూడండి.
మంచి నునైతే రుచి నల్ల మిరియాల్లాగా ఉంది.అదే కల్తీ నూనె అయితే చేదుగా ఉంటుంది.
"""/" /
అలాగే మీరు వాడే వంట నూనె మంచిదేనా? లేక కల్తీదా? అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే.
ముందు ఇక స్టీల్ బౌల్ తీసుకుని అందులో అర కప్పు నూనె పోసి ఫ్రిజ్లో పెట్టండి.
ఒక అర గంట అనంతరం ఫ్రిజ్లో పెట్టిన గిన్నెను తీసి గమనిస్తే నూనెపై తెల్లటి పొర పేరుకు పోయి ఉంటుంది.
కల్తీ నూనెకే తెల్లటి పొర పేరుకుంటుంది.ఒక వేళ తెల్లడి పొర లేదు అంటే మీరు వాడేది మంచి నూనే.
ఇక మరో విధంగా కూడా కల్తీ నూనెను గుర్తించవచ్చు.అందు కోసం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని అందులో కొద్దిగా మీరు వాడే నూనెను వేయండి.
అపై అందులో రెండు, మూడు చుక్కలు నైట్రిక్ యాసిడ్ యాడ్ చేసి హీట్ చేయండి.
నూనె రంగు గనుక మారితే.అది కల్తీ నూనే.
రంగు మారలేదు అంటే మంచి నూనె అని అర్థం.
రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిన స్టార్ హీరో ప్రభాస్.. ఫౌజీ సినిమాకు అంత తీసుకుంటున్నారా?