స్నానం చేయడంలో కూడా నియమ నిబంధనలున్నాయనే విషయం మీకు తెలుసా?
TeluguStop.com
ప్రతీ ఒక్కరూ వీలయినంత వరకు ప్రతి రోజూ స్నానం చేస్తుంటారు.కుదరకపోతే రెండ్రోజులకు ఒకసారైనా చేస్తుంటారు.
మనకున్న సమయాన్ని బట్టి కొంచెం ఎక్కువ సేపో లేదా తక్కువ సేపో చేస్తుంటాం.
తల స్నానం అయితే మరో ఐదు నిమిషాలు ఎక్కువే పడుతుందనే విషయం మనందరికీ తెలిసిందే.
కానీ మన హిందూ పురాణాల ప్రకారం సాన్నం చేయడంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి.
అసలు మనకు ఈ విషయమే తెలియదు.అయితే స్నానం ఎలా చేయాలి, ఎంత సేపు చేయాలనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసు కుందాం.
ప్రతీరోజు అరగంట సేపు స్నానం చేయడం చాలా మంచిదని మన పెద్దలు చెబుతున్నారు.
ముందుగా ఓ నాలుగు చెంబులతో శరీర భాగాల్ని తడిపి.ఆ తర్వాత సున్ను పిండి లేదా సబ్బుతో శుభ్రంగా రుద్దుకోవాలి.
ఆపై మరో 8 చెంబులతో శరీరాన్ని మంచిగా కడుక్కోవాలి.ఆ తర్వాత మొత్తటి టవల్ తీసుకొని దేహాన్ని అద్దుకుంటూ తడి పోయేలా తుడుచు కోవాలి.
స్నానం చేసిన తర్వాత శరీరంలోని భాగాలను శుభ్రంగా తుడుచు కోకపోతే ఎన్నో రకమైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుందట.
ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి జబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుందట.అందుకే తుడుచుకున్న తర్వాత నిమిషం పాటు ఫ్యాన్ కింద నిల్చుంటే మంచిదట.
అయితే మహిళలు వంటి మీద ఏం లేకుండా నానం చేయాలి.మగవారు అయితే ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలట.
కానీ నగ్నంగా ఉండి అస్సలే స్నానం చేయ కూడదట.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025