కూరల్లో ఉప్పు ఎక్కువైందా..? ఈ చిట్కాలతో సరిచేసేయండి!
TeluguStop.com
సాధారణంగా ఒక్కోసారి కంగారుతోనో లేదా మతిమరిపుతోనో కూరల్లో ఉప్పు ఎక్కువ వేసేస్తుంటారు.ఈ పొరపాటు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎప్పుడో అప్పుడు జరిగే ఉంటుంది.
కూరల్లో ఉప్పు తక్కువైతే మళ్లీ వేసుకోవచ్చు.కానీ, ఎక్కువైతే ఏం చేయాలో తెలియక చాలా మంది తలలు పట్టుకుంటారు.
దాంతో ఎంతో ఇష్టంగా కష్టపడి వండిన కూరను తినలేరు.అలా అని డస్ట్ బిన్‌లోనూ వేయలేరు.
అలాంటిప్పుడు ఎలాంటి దిగులు చెందకుండా కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సులువుగా కూరల్లో ఎక్కువైన ఉప్పును తగ్గించవచ్చు.
మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు గోధుమ పిండితో తగ్గించుకోవచ్చు.
అందుకోసం, గోధుమ పిండిలో నీళ్లు పోసి ముద్దగా కలుపుకుని కూరలో వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి.
ఆ తర్వాత గోధుమ పిండి ముద్దను తీసేయాలి.ఇలా చేస్తే అధికంగా ఉన్న ఉప్పును గోధుమ పిండి ముద్ద పీల్చేసుకుంటుంది.
అలాగే పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువైతే అందులో ఒక స్పూన్ వెనిగర్ మరియు ఒక స్పూన్ చక్కెర వేసి కాసేపు ఉడికించాలి.
ఇలా చేసినా కూడా కూరలో ఎక్కువైన ఉప్పు తగ్గుతుంది. """/"/
ఉల్లి పాయలతో కూడా కూరలో అధిక ఉప్పును తగ్గించవచ్చు ఏదైనా కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే.
అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు ఉంచిన తర్వాత తీసేయాలి.ఇలా చేస్త కూరలో ఉప్పు మీ టేస్ట్‌కు తగ్గట్లు ఉంటుంది.
గ్రేవీ కర్రస్ లో ఉప్పు ఎక్కువైతే అప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.
ఆ తర్వాత టేస్ట్ చూస్తే.అందులో తప్పకుండా ఉప్పు తగ్గుతుంది.
ఇక చేసే కూరను బట్టి టమోటో ముక్కలు యాడ్ చేసినా ఉప్పు తగ్గుతుంది.
లేదా ఉప్పును తగ్గించేందుకు నిమ్మ రసం కూడా కలపొచ్చు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్28, గురువారం 2024