టీనేజ్‌లో అమ్మాయిలను వేధించే రక్తహీనత.. ఎలా తరిమికొట్టాలంటే?
TeluguStop.com
రక్తహీనత.టీనేజ్ అమ్మాయిలను తీవ్రంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
నెలసరి, ఆహారపు అలవాట్లు, ఐరన్ విటమిన్ బి12 వంటి పోషకాల కొరత, పలు రకాల మందుల వాడకం వంటి రకరకాల కారణాల వల్ల రక్తహీనత సమస్య వేధిస్తూ ఉంటుంది.
దాంతో నీరసం, అలసట, తరచూ తలనొప్పి, బరువు పెరగడం లేదా తగ్గడం వంటి ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
అయితే వాటిని నివారించుకుని రక్తహీనతను తరిమికొట్టాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ తాగాల్సిందే.
మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక కప్పు పాలకూర తీసుకుని వాటర్‌తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బీట్‌రూట్ ను పీల్ తొలగించి వాటర్‌లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే రెండు ఆరెంజ్ పండ్లను కూడా తీసుకుని తొక్క తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో పాలకూర, ఆరెంజ్ పండ్లు, బీట్ రూట్ ముక్కలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ పాలకూర-బీట్‌రూట్-ఆరెంజ్ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి తాగేయడమే.
రక్తహీనతతో సతమతం అయ్యే టీనేజ్ అమ్మాయిలే కాదు పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే రోజుకు ఒకసారి ఈ జ్యూస్‌ను తీసుకుంటే.
చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయట పడతారు. """/"/
అలాగే ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల చర్మం నిగారింపుగా మెరుస్తుంది.
వృద్ధాప్య ఛాయలు తొందరగా దరి చేరకుండా ఉంటాయి.ఎముకలు దృఢంగా మారతాయి.
గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
రోగ నిరోధక వ్యవస్థ సైతం బలంగా మారుతుంది.
రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!