కేంద్రం ఇస్తున్న క్రెడిట్ కార్డు కోసం ఇలా అప్లై చేసుకోండి..!
TeluguStop.com
కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసినదే.
ఈ క్రమంలో రైతులకు మోడీ ప్రభుత్వం ఓ బహుమతి ప్రకటించింది.అదే కిసాన్ క్రెడిట్ కార్డ్.
రైతులందరికీ ఈ క్రెడిట్ కార్డు తీసుకొనే వీలు కల్పిస్తోంది మన కేంద్రం.అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) తీసుకోవడమెలా.
? అనే ప్రశ్న చాలామందిలో వుంది.ముఖ్యంగా రైతులకు ఈ సందేహం వుంది.
ఈ నేపథ్యంలోనే కేంద్రం వారికి సులువుగా కేవలం 3 పత్రాలను మాత్రమే సమర్పించమంటోంది.
అలాగే దరఖాస్తు చేసిన కేవలం 15 అంటే 15 రోజుల్లోనే కెసిసి జారీ చేస్తారు.
ఇకపోతే ఈ కార్డ్ లిమిట్ గురించి ఇపుడు తెలుసుకుందాం.కిసాన్ క్రెడిట్ కార్డ్ పై రూ .
3 లక్షల వరకు తీసుకున్న రుణాలకు వడ్డీ రేటు 9%.కానీ ప్రభుత్వం అందులో 2% సబ్సిడీ ఇవ్వబోతుంది.
ఈ విధంగా ఇది 7%కు తగ్గుతుంది .అలాగే సమయానికి మనం రుణం చెల్లిస్తే, 3 శాతం ఎక్కువ తగ్గింపు లభించడం గమనార్హం.
ఈ విధంగా, రైతు 4% చెల్లిస్తే సరిపోతుంది.ఇంతకుముందు, KCC జారీ చేసిన రైతులకు ప్రాసెసింగ్ ఫీజు, తనిఖీ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించేది.
కానీ ఇప్పుడు వాటిని రద్దు చేశారు.అయితే ప్రస్తుతం KCC కింద 3 లక్షల రూపాయల రుణం లభిస్తుంది.
ఇంతకుముందు రూ .1 లక్ష రుణం గ్యారెంటీ లేకుండా లభించేది.
అయితే దీని పరిమితిని రూ .1.
60 లక్షలకు పెంచడం గమనార్హం.ఇక ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ను పొందాలంటే.
వ్యక్తికి వ్యవసాయం (భూములు) ఉండి తీరాలి.వ్యక్తికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు, అలాగే రుణ వ్యవధి ముగిసే వరకు గరిష్టంగా 75 సంవత్సరాలు కలిగి ఉండాలి.
60 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు, సహ దరఖాస్తుదారుడు ఉండాలి.సహ దరఖాస్తుదారుడి వయస్సు 60 ఏళ్లలోపు ఉండే విధంగా నియమ నిబంధనలు ఉన్నాయి.
ఇక ఇందుకు కావలసిన పత్రాలను చూస్తే .ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఓటరు ఐడి కార్డ్, ఐడి ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, లేదా అడ్రస్ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజు ఫోటో కలిగి ఉండాలి.
ఇక ఇప్పటికే చాలా బ్యాంక్స్ KCC కోసం ఆన్‌లైన్ దరఖాస్తును అందిస్తున్నాయి.ఇందుకోసం వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు ఫారంను పొందవచ్చు.
పానీపూరీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. జస్ట్ ఇంత పే చేస్తే లైఫ్‌లాంగ్ పానీపూరీ ఫ్రీ.. ఎక్కడంటే?