ఇన్‌స్టాగ్రామ్ నోట్స్‌లో అదిరిపోయే ఫీచర్ గమనించారా?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ "నోట్స్" ( Instagram Notes ) అనే కొత్త ఫీచర్‌ను కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టింది, ఇది వినియోగదారులు వారి స్నేహితులతో చిన్న అప్‌డేట్‌లను పంచుకోవడానికి అనుమతిస్తుంది.

సాధారణంగా, వినియోగదారులు ఈ నోట్స్‌కు టెక్స్ట్ లేదా ఎమోజీలను మాత్రమే జోడించగలరు.అయితే ఇప్పుడు మరొక అప్‌డేట్ రిలీజ్ చేసి నోట్స్‌కు యూజర్లు సంగీతాన్ని( Music ) యాడ్ చేసే ఫెసిలిటీని కూడా ఇన్‌స్టాగ్రామ్ ఆఫర్ చేసింది.

ఈ అప్‌డేట్‌తో ఇన్‌స్టాగ్రామ్( Instagram ) యూజర్లు తమ నోట్స్‌కు 30 సెకన్ల వరకు సంగీతాన్ని జోడించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లోని చాట్ విభాగంలో నోట్స్‌ కనిపిస్తాయి.అదృశ్యమయ్యే ముందు 24 గంటల పాటు యాక్టివ్‌గా ఉంటాయి.

దీని అర్థం స్నేహితులు, ఫాలోవర్స్ మీరు రోజంతా పంచుకునే మ్యూజిక్ నోట్స్‌ చూడగలరు.

"""/" / ఇన్‌స్టాగ్రామ్ నోట్స్‌కు సంగీతాన్ని ఎలా జోడించాలో ఇప్పుడు తెలుసుకుందాం.1.

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని తెరిచి, చాట్ విండోకు వెళ్లండి.2.

టాప్ లెఫ్ట్ కార్నర్‌లో "యువర్ నోట్స్" అనే ఒక ప్లస్ ఐకాన్ కోసం వెతకండి.

ఆపై దానిపై నొక్కండి.3.

"యాడ్ మ్యూజిక్" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. """/" / 4.

ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ నుంచి జోడించాలనుకుంటున్న ట్రాక్ లేదా పాటను ఎంచుకోండి.5.

మీరు కావాలనుకుంటే సంగీతంతో పాటు టెక్స్ట్ మెసేజ్ లేదా ఎమోజీని కూడా జోడించవచ్చు.

ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ యూజర్లందరికీ రిలీజ్ అవుతుంది.మీకు ఇంకా రిలీజ్ కాకపోతే యాప్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్‌డేట్ చేసుకోవాలి.

అయినప్పటికీ ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రాకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయాలి.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности