నేరాలు చేసే హీరోలే కావాలి.. ఏం సినిమాలు బాబోయ్
TeluguStop.com
ఈ మధ్య కాలం లో సినిమా పోకడ పూర్తిగా మారిపోతుంది.సినిమా అంటే ఒక హీరో, ఒక విలన్, హీరోయిన్ ఇలా కొన్ని క్యారెక్టర్స్ ప్రత్యేకంగా సృష్టించుకుంటారు.
హీరో అంటే మంచివాడు, విలన్ అంటే చెడ్డవాడు అని ఒక భావన మనలో ఉండేది.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.హీరో అయినా విలనైనా కూడా అన్ని ఎలివేషన్స్ కావాలి మనకు.
విలనిజంతో కూడిన హీరోని బాగా ఇష్టపడుతున్న రోజులు ఇవి.అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలలో హీరో ఎవరో, విలన్ ఎవరో కూడా క్లారిటీ ఉండటం లేదు.
చెడ్డ పని చేసిన ఆ హీరోని కూడా మనం మెచ్చుకుంటున్నాం, వారిని ఆరాధిస్తున్నాం.
గత కొన్ని రోజులుగా హాట్ స్టార్ లో ఒక సినిమా బాగా వైరల్ అవుతుంది.
ఆ సినిమా పేరు ముకుందన్ ఉన్ని అసోసియేట్స్.అందరూ ఈ సినిమా గురించి అందరు పొగుడుతుంటే సినిమా అంత బాగుంటుందా అని చూసేవారు కొందరు.
తీరా సినిమా చూసిన తర్వాత పూర్తి స్థాయి నేరపూరితమైన మనస్తత్వం ఉన్న హీరో.
ఈ సినిమాలో హీరో చాలా చక్కగా నటించాడు, కానీ మంచి సినిమా అయితే ఖచ్చితంగా కాదు.
"""/" /
ఇలాంటి విష ప్రయోగపూర్తమైన సినిమాలను జనాలు ఎందుకు అంగీకరిస్తున్నారో అర్థం కాకుండా ఉంది.
అసలు హీరో అంటే సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అనేదే ముఖ్యమైన ప్రశ్న.
హర్షద్ మెహతా లాంటి ఒక ఆర్థిక నేరగాడిని ఇప్పటికీ చాలామంది ఆరాధిస్తున్నారు అంటే చూసే జనాల దృష్టి కూడా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
జనాలకి ఇప్పుడు పుష్పాలు హీరోస్ మగ్గింగ్ చేస్తేనే ఇష్టం, లాయర్ అంటే నేరాలను ఎలా లీగల్ గా చేయాలో చెప్తేనే ఇష్టం.
"""/" /
దీన్ని బట్టి మన విలువలు ఎంతలా పాతాళానికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ దివాలా కోరు దిక్కుమాలిన సినిమాలు చేసి జనాల మనసులను ఇంకా కలుషితం చేయడం తప్ప వచ్చే లాభం ఏమీ లేదు.
ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ సినిమాలో హీరో లాయర్ పాత్రలో ఉండి కెరియర్ లో తొక్కబడితే అడ్డదారులు తొక్కుతాడు.
ఆ హీరోకి సపోర్ట్ చేసే హీరోయిన్ ఫైనల్ గా సినిమా పెద్ద హిట్టు దాన్ని బట్టి మనకు ఏం కావాలో అర్థమైంది అనుకుంటా ?.
బెల్లం, లవంగాలు కలిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?