ఎంతో పెద్ద మ్యాజిక్ జరిగితే తప్ప ఈ హీరోలు ఒక హిట్టు కొట్టడం జరిగే పని కాదు !
TeluguStop.com
వందల, వేల కోట్ల ఆస్తి ఉండొచ్చు .అంతకన్నా బడా బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండి ఉండచ్చు.
అన్ని ఉన్నా కూడా ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే అంటే బోలెడంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం ఉండాలి తప్ప ఏం చేసినా హీరోలుగా హిట్స్ కొట్టలేరు.
అలా ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా విజయాలు సాధించలేని కొంతమంది హీరోలు ఉన్నారు.
మరి వారు హిట్ కొట్టడం అనేది ఈ జన్మలో జరుగుతుందో లేదో అనేది చాలామందికి ఉన్న అనుమానం.
అలా ఇటు కొట్టలేకపోతున్నా ఆ టాలీవుడ్ హీరోలు ఎవరు ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleబెల్లంకొండ శ్రీనివాస్/h3p """/" /
బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Srinivas ) తండ్రి బెల్లంకొండ సురేష్ బడా వ్యాపారవేత్త అంతకన్నా బడా ప్రొడ్యూసర్.
అయితే మాత్రం కొడుకు హిట్టు కొడతాడా ఏంటి.? వందల కోట్లు పెట్టి సినిమాలు తీసినా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ జాతకంలో ఒక విజయం కూడా రాసిపెట్టినట్టు లేదు.
కేవలం రీమేక్ సినిమా అయినా రాక్షసుడు ఒక్కటే పరవాలేదు అనిపించింది.బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ కూడా అతడికి రూపాయి కలెక్షన్స్ ఇవ్వలేదంటే ఇక శ్రీనివాస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
H3 Class=subheader-styleసుధీర్ బాబు/h3p """/" /
ఎంత పెద్ద హీరో ఫ్యామిలీ నుంచి వచ్చిన కూడా సుధీర్ బాబుకు( Sudheer Babu ) ఒక విజయం దక్కడం లేదు.
ఘట్టమనేని కుటుంబం అంతా కూడా సుదీర్ బాబు వెనుక ఉంది.అయినా కూడా ఒక హిట్ అంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు.
అప్పుడెప్పుడో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రేమకథా చిత్రం అనే ఒక్క సినిమా విజయం దక్కింది.
ఆ తర్వాత పదివేలు గడిచినా కూడా హిట్ అనే ఊసే లేదు.h3 Class=subheader-styleఅక్కినేని అఖిల్/h3p """/" /
ఈ అయ్యవారు కూడా హీరో ఎలా అయ్యారో అర్థం కాని పరిస్థితి.
అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇప్పటికి నాలుగైదు సినిమాల్లో నటించిన ఒక్క విజయం లేకపోయినా మళ్లీ కొంతమంది డబ్బులు పెట్టి ఆయన చేత సినిమాలు చేయించుతున్నారు.
సినిమాలు అయితే వస్తున్నాయి కానీ విజయాల మాటేమిటి మరి ? ఇక పూజా హెగ్డే తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పరవాలేదు అనిపించిన ఇక ఇప్పట్లో అఖిల్ కి( Akhil ) విజయాలు దొరుకుతాయి అంటే అది పెద్ద అనుమానమే.
H3 Class=subheader-styleఅల్లు శిరీష్/h3p """/" /
తండ్రి పెద్ద దర్శకుడు, తాత పెద్ద నటుడు, అన్న పెద్ద హీరో అయితే ఏంటి ? అల్లు శిరీష్ కి( Allu Sirish ) హిట్టేది .
? కేవలం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి శిరీష్ కి.
ఇక హీరోగా ప్రయత్నాలు చేయడం ఆపేస్తే మంచిది అని అల్లు ఫ్యామిలి అంతా కోరుకుంటున్నారు.
అల్లు అభిమానులు కూడా ఇదే చెప్తున్నారు.అల్లు అర్జున్ పరువు తీయకుండా ఉంటే చాలు అని.
ఇన్నేళ్లలో ఒక్క విజయం కూడా దక్కలేదు ఇప్పటి వరకు అల్లు శిరీష్ కి.
ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదు.