ఇలా అయితే ఎలా ? తెలంగాణ బీజేపీ నాయకులకు ఏమైంది ?
TeluguStop.com
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS Party ) ను ఓడించి తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల ఆ పార్టీ కేంద్ర పెద్దల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
కేంద్ర లో ఉన్న బిజేపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్న సీఎం కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించాలనే ధ్యేయంతో బిజెపి అగ్ర నేతలు ఉన్నారు.
ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ధీటుగా బిజెపిని బలోపేతం చేసి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
దీంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు బిజెపి వినూత్నంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని బిజెపి చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బిజెపి అగ్ర నాయకత్వం సూచించింది.
దీంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బిజెపి అనుబంధ సంఘాల ఉమ్మడి సమ్మేళనాలు, మేధావులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలనే రూట్ మ్యాప్ ఇచ్చింది.
ఈనెల 15 నుంచి 22 వరకు అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కేంద్ర నాయకత్వం తెలంగాణ బిజెపి నాయకులకు సూచనలు చేసింది.
అయితే కొన్ని కొన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరగకపోవడం, జాతీయస్థాయి నాయకులు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో తప్ప ,మిగతా సమయంలో సైలెంట్ అయిపోవడం వంటివన్నీ బిజెపి అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటోంది.
పార్టీ నిర్ణయించిన ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చారు .
ఒకటి రెండు రోజులు ఇక్కడి కార్యక్రమంలో పాల్గొన్నా.రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దగా ఈ కార్యక్రమాలను పట్టించుకోలేదట.
"""/" /
పార్టీలో అంతర్గత వివాదాలు పెరిగిపోవడంతోనే ఈ కార్యక్రమాలను ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది.
ముఖ్యంగా కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ అభియాన్ కార్యక్రమానికి అనుకున్నంత స్థాయిలో తెలంగాణలో ఆదరణ దక్కలేదని బిజెపి( BJP ) అధిష్టానం పెద్దలు గుర్తించారట.
బిజెపిలోని పాత నాయకులకు ఇటీవల కాలంలో పార్టీలో చేరిన వారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండడం, ఎక్కడికక్కడ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం వంటివన్నీ బిజెపి దూకుడుకు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి.
"""/" /
ఆ ప్రభావం పార్టీ నిర్ణయించిన కార్యక్రమాల పైన పడుతూ ఉండడం, మరోవైపు ఇదే విధంగా కాంగ్రెస్( Congress Party ) చేరికలపై దృష్టి సారించి బిఆర్ఎస్, బిజెపిలలోని అసమతి నేతలను గుర్తించి, తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలపై బిజెపి అధిష్టానం సీరియస్ గానే ఉండడంతో దీనిపై త్వరలోనే తెలంగాణ బిజెపి నాయకులకు గట్టిగానే క్లాస్ పీకే అవకాశం ఉన్నట్టు సమాచారం.
పాన్ ఇండియా లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరోలు…